Moviesఅమ్మ బాబోయ్.. లావణ్య త్రిపాఠి ఇలా మారిపోయింది ఏంటి.Miss Perfect వెబ్...

అమ్మ బాబోయ్.. లావణ్య త్రిపాఠి ఇలా మారిపోయింది ఏంటి.Miss Perfect వెబ్ సిరీస్ టీజర్ (వీడియో)..!!

పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్” . ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా చేసింది లావణ్య త్రిపాఠి. కాగా తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది మిస్ పర్ఫెక్ట్ . ఈ వెబ్ సిరీస్లో లావణ్య త్రిపాఠి ఒసిడి గల అమ్మాయిగా నటిస్తుంది . ఈ పాత్రకి ఆమె ది పర్ఫెక్ట్ అంటూ అభిమానులు ఫీల్ అయిపోతున్నారు .

ఈ సిరీస్ లో అభిజిత్ మేల్ లీడ్ పాత్ర పోషిస్తున్నారు. ఝాన్సీ – హర్షవర్ధన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ లో లావణ్య త్రిపాఠి పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమ పెళ్లి చేసుకొని కొణిదెల వారి ఇంటికి కోడలిగా వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇక పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతాను అని తెలియజేసిన లావణ్య.. ఇప్పుడు బ్యాక్ టు వర్క్ వచ్చేశారు. ఓ తమిళ్ సినిమాలో నటిస్తున్న లావణ్య.. ఇక ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్ సిరీస్ టీజర్ చూశాక లావణ్య లో మరో యాంగిల్ బయట పడ్డింది. ఖచ్చితంగా ఈ సిరీస్ ఆమెకు మంచి కం బ్యాక్ హిట్ ఇస్తుంది అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేసేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news