Movies"వాడు ఈ కుంటి గుర్రం"..ఎన్టీఆర్ ను దారుణంగా అవమానించిన ఆ స్టార్...

“వాడు ఈ కుంటి గుర్రం”..ఎన్టీఆర్ ను దారుణంగా అవమానించిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పేరు చెప్తే ఊగి పోయే జనాలు ఎక్కువ . నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ “దేవర” సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు . ఆ తర్వాత మళ్లీ దేవర 2 సెట్స్ లో పాల్గొనబోతున్నాడు .

అదేవిధంగా బాలీవుడ్ లో కమిట్ అయిన వార్ 2 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . ఇలా బ్యాక్ టు బ్యాక్ అన్నీ బడా సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ని ఓ స్టార్ డైరెక్టర్ కుంటి గుర్రం అంటూ అవహేళనగా మాట్లాడారు . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అంటే మాత్రం స్టూడెంట్ నెంబర్ వన్ అనే చెప్పాలి . ఈ సినిమాను తెరకెక్కించింది ఎస్ఎస్ రాజమౌళి . ఆయనకు ఇది ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ కి ఇది సెకండ్ సినిమా .

అయితే రాజమౌళి ఫస్ట్ సినిమా ఓ బడా హీరోతో తీయాలని డిసైడ్ అయ్యారట. కానీ నాకేంటి జూనియర్ ఎన్టీఆర్ ని ఇచ్చారు అంటూ తెగ బాధ పడిపోయారట. అంతేకాదు ఇంత బొద్దుగా ఉన్నాడు ..హైట్ తక్కువగా ఉన్నాడు.. ఏం స్టెప్స్ వేస్తాడు .. ఏమి ఎగురుతాడు.. ఏమి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు ..??? అంటూ చాలా బాధపడిపోయారట . కానీ మళ్ళీ ఆయనకు ఆయన నచ్చ చెప్పుకున్నారట . కుంటి గుర్రంతోనే రేసులో హిట్ కొట్టాలి అని అప్పుడే ఆ మజా వస్తుంది అని అనుకోని ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాను తీయడానికి ఓకే చేశారట . ఆ తర్వాత ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో.. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు ఈ సినిమా ద్వారానే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులుగా మారిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news