Moviesబుక్‌మై షోలో ' హ‌నుమాన్ ' వీరంగం.. సెన్షేష‌న‌ల్ రికార్డ్‌...!

బుక్‌మై షోలో ‘ హ‌నుమాన్ ‘ వీరంగం.. సెన్షేష‌న‌ల్ రికార్డ్‌…!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ సినిమా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆక‌ట్టుకుంటోందో చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా రు. 200 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రు. 100 కోట్ల‌కు పైగా షేర్ కొల్ల‌గొట్టింది. ఇక ఓవ‌ర్సీస్‌లో అయితే హ‌నుమాన్ ఏకంగా రు. 35 కోట్లు రాబ‌ట్టింది.

బాక్సాఫీస్ వ‌ద్ద హ‌నుమాన్ హ‌వా ఇప్ప‌ట‌కీ త‌గ్గ‌లేదు. మ‌రో ప‌ది రోజుల‌కు పైగా హ‌నుమాన్ టిక్కెట్లు దొరికే ప‌రిస్థితి లేదు. నైజాంలో 10 రోజుల‌కే ఏకంగా రు. 22 కోట్ల నెట్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ క్ర‌మంలోనే హ‌నుమాన్ ప్ర‌ముఖ టిక్కెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో ఇప్ప‌టి వ‌ర‌కు 30 ల‌క్ష‌ల‌కు పైగా టిక్కెట్లు బుక్ చేసుకుని స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

నిజంగానే హ‌నుమాన్ లాంటి చిన్న సినిమాకు ఇది సెన్షేష‌న్ అని చెప్పాలి. ఇక ఆదివారంతో పాటు సోమ‌వారం అయోధ్య‌లో రామ‌మందిరం ప్ర‌తిష్ట ఉండ‌డంతో ఫ‌స్ట్ షో, సెకండ్ షోల‌కు ఇప్ప‌టికే హౌస్ ఫుల్స్ క‌న‌ప‌డుతున్నాయి. ఏదేమైనా హ‌నుమాన్ వీరంగం ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. ఈ సినిమాలో తేజ స‌జ్జాతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news