Movies"ఆ రోజు అలా చేసేసరికి..నా ఫ్యామిలీ కూడా నాకు మెంటల్ పట్టింది...

“ఆ రోజు అలా చేసేసరికి..నా ఫ్యామిలీ కూడా నాకు మెంటల్ పట్టింది అనుకున్నేసింది”..షాకింగ్ విషయాని రివీల్ చేసిన నాగార్జున..!!

అక్కినేని నాగార్జున .. ఓ కింగ్..ఓ మన్మధుడు ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే . వయసు మీద పడిపోతున్న సరే ఇంకా యంగ్ గా అందంగా కనిపిస్తూ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు . రీసెంట్గా నాగార్జున నటించిన సినిమా నా సామి రంగ . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కలెక్షన్స్ పరంగా కూడా నాగార్జునను సాటిస్ఫై చేసింది నా స్వామి రంగా . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం లాభాల వర్షం కురిపించడంతో సినిమా బృందం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది .

గ్రాండ్గా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నింది నా సామి రంగ మూవీ టీం . ఈ క్రమంలోనే నాగార్జున మాట్లాడుతూ ఎప్పుడు ఏ స్టేజిపై మాట్లాడిన విధంగా మాట్లాడారు. ” ఫస్ట్ నా ఫాన్స్ అందరికీ చాలా చాలా థాంక్స్ ..ఈ సినిమా ఇంత హిట్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ వల్ల ఇది సాధ్యమైంది.. డిస్ట్రిబ్యూటర్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు.. వాళ్ళందరికీ పేరుపేరునా ధన్యవాదాలు ..మూవీ టీంను ప్రతి సెకండ్ మిస్ అవుతున్నాను.. ఈ మూవీ షూట్లో బాగా ఎంజాయ్ చేశాను ..చాలా తక్కువ టైంలోనే ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిపోయింది “.

“నాన్నగారి బర్త్డ డే నాడు సెప్టెంబర్ 20న ఈ సినిమాను లాంచ్ చేసాం . ఒకవైపు నాన్నగారి స్టాచ్యు ఆవిష్కరణ జరుగుతుంది. మరోపక్క సినిమా లాంచ్ ఈవెంట్ కు వెళ్లాలి .. దీంతో అమలా నాపై కోప్పడింది. తర్వాత వెళ్ళొచ్చుగా అని అనింది ..కానీ నేను కాదు ఇప్పుడే వెళ్లాలి అన్నాను ..ఆ సమయంలో నేను బిహేవ్ చేసిన పద్ధతికి నాకు మెంటల్ పట్టింది అని అమల – నాగచైతన్య -అఖిల్ అనుకున్నారు. నా మాటలను అస్సలు నమ్మలేదు. మూడు నెలల సమయం కూడా లేదు ఎలా విడుదల చేస్తావు మూవీని అంటూ వింతగా విచిత్రంగా చూశారు. దీనంతటికీ కారణం నా సినిమా టీం..అందుకే ఈ సినిమా చక్కగా అనుకున్న సమయానికి రిలీజ్ చేయగలిగాము.. మంచి విజయాన్ని అందుకున్నాము అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు . ప్రజెంట్ నాగార్జున మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news