Moviesబాల‌య్య అఖండ 2లో ఆ బాలీవుడ్ హీరో కూడా...!

బాల‌య్య అఖండ 2లో ఆ బాలీవుడ్ హీరో కూడా…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య – బోయ‌పాటి కాంబినేష‌న్లో వ‌చ్చిన హ్యాట్రిక్ హిట్ సినిమాగా అఖండ రికార్డుల‌కు ఎక్కింది. సింహా, లెజెండ్ త‌ర్వాత అఖండ హ్యాట్రిక్ కొట్టింది. అఖండ త‌ర్వాతే బాల‌య్య‌కు ప‌ట్టింద‌ల్లా బంగారం అయ్యింది. ఆ త‌ర్వాతే వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలు కూడా సూప‌ర్ హిట్ కొట్టాయి.

ప్ర‌స్తుతం బాల‌య్య బాబి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 109వ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత అఖండ‌కు కంటిన్యూగా అఖండ 2 సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. బోయ‌పాటి అఖండ 2 మీద క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టేశాడు. క‌థ మీద వ‌ర్క్ న‌డుస్తోంది. అయితే అఖండ 2 ఎప్పుడు సెట్స్ మీద‌కు వెళుతుంది ? ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? ఈ సినిమా కాస్ట్ & క్రూ ఎవ‌రు ? అన్న‌ది ఫ్యాన్స్‌లో స‌హ‌జంగానే ఆస‌క్తిగా మారింది.

ఈ యేడాది జూన్ నుంచి అఖండ 2 సెట్స్ మీద‌కు వెళుతుంద‌ని అంటున్నారు. అఖండ 2లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్‌ద‌త్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. సంజ‌య్‌ద‌త్ లాంటి సీనియ‌ర్ హీరో కూడా ఈ సినిమాలో న‌టిస్తే ఆ సినిమాకు నార్త్‌లో కూడా అదిరిపోయే బ‌జ్ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అఖండ సినిమాను డ‌బ్బింగ్ చేస్తే యూట్యూబ్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నార్త్ జ‌నాల‌ను కూడా బాగా ఊపేసింది.

ఈ సినిమాలో యాక్ష‌న్ మాస్ ల‌వ‌ర్స్‌కు మాంచి కిక్ ఇచ్చింది. అందుకే ఇప్పుడు అఖండ 2ను పాన్ ఇండియా రేంజ్‌ల్ చేసేందుకే సంజ‌య్‌ద‌త్‌ను విల‌న్ రోల్లో న‌టింప‌జేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క‌థ‌లో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ తో పాటు మెయిన్ క‌థాంశం చాలా కొత్త‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా బాల‌య్య నుంచి మ‌రో వినూత్న సినిమా రాబోతోంద‌న్న‌ది అయితే క్లారిటీ వ‌చ్చేసింది. సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్స్‌తో పాటు పొలిటిక‌ల్ పంచ్‌లు అదిరిపోతాయంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news