Moviesవావ్: "దేవర" నుండి మరో బిగ్ సర్ప్రైజ్.. ఈ సంక్రాతి మొత్తం...

వావ్: “దేవర” నుండి మరో బిగ్ సర్ప్రైజ్.. ఈ సంక్రాతి మొత్తం ఎన్టీఅర్ ఫ్యాన్స్ దే.. పండగ చేస్కోండి..!!

దేవర .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారు మ్రోగిపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమానే ఈ “దేవర”. ఫిషింగ్ హర్బర్ విలేజ్ పోర్టు మాఫియా నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . తెలుగులో ఇదే సినిమా ద్వారా ఆమె డెబ్యూ ఇస్తూ ఉండడం గమనార్హం.

అంతేకాదు ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న రిలీజ్ కాబోతుంది . కాగా రీసెంట్ గానే సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ 24 గంటల్లోనే 57 మిలియన్లకు పైగా వ్యూయ్స్ తో రికార్డులు క్రియేట్ చేసి టాప్ ట్రైనింగ్ లో దూసుకుపోతుంది . దీంతో దేవర గ్లింప్స్ పట్ల వస్తున్న స్పందన పై చాలా హ్యాపీగా ఫీల్ అయిన దేవర టీం ..

గ్లింప్స్ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా తారక్ అండ్ రత్నవేలు టీం ఒకచోట చేరి సందడి చేసింది . కొరటాల శివ, తారక్ , రత్న వేలు అండ్ టీం కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఇది నిజంగా మంచి గుస్ బంప్స్ ఇస్తుంది. రీసెంట్ గానే గ్లింప్స్..ఆ తరువాత ఇలా తారక్ న్యూ స్టిల్..తో సోషల్ మీడియాలో దేవర హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news