MoviesTL రివ్యూ: ' బబుల్‌గమ్ ' లాంటి ల‌వ్ స్టోరీ..

TL రివ్యూ: ‘ బబుల్‌గమ్ ‘ లాంటి ల‌వ్ స్టోరీ..

ప‌రిచ‌యం :
యాంకర్ సుమ పేరు చెప్పగానే గలగల మాట్లాడే యాంకర్ గుర్తుకు వస్తుంది. ఎంతోమంది హీరోల సినిమాల ఇంటర్వ్యూలు చేసి… ప్రి రిలీజ్ ఫంక్షన్లకు హోస్టింగ్ చేయ‌డంలో ఆమె దిట్ట‌. సుమారు గత 20 ఏళ్లలో తెలుగు యాంకరింగ్ రంగంలో తనకంటూ ముద్ర వేసుకుంది. తాజాగా తన కొడుకుని హీరోగా పరిచయం చేసింది. బబుల్‌గ‌మ్‌ పేరుతో తరికెక్కిన సినిమాలో సుమ – రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ? సుమ కొడుకు హీరోగా తొలి సినిమాతో సక్సెస్ అయ్యాడా లేదో సమీక్షలో చూద్దాం.

క‌థ :
ఆది ( రోషన్ కనకాల ) హైదరాబాద్ కుర్రోడు డీజే కావాలన్నది అతడి లక్ష్యం. ఒకరోజు పబ్‌లో అనుకోకుండా జాన్వి ( మానస చౌదరి ) ని చూస్తాడు. తొలిచూపులోనే ఆమె నచ్చేస్తుంది. ఆమెని ఫాలో అయిపోతాడు. అటు జాన్వి బాగా డబ్బున్న అమ్మాయి. కొన్ని నెలల్లో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నాల్లో ఉంటుంది. ఈ లోపు ఎవరైనా అబ్బాయితో ఆడుకుని వాడి హార్ట్ బ్రేక్ చేసి వెళ్లిపోవాలని అనుకుంటుంది. డీజే బాగా చేస్తున్నావని చెప్పి ఆదికి దగ్గరవుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు సిన్సియర్గా ప్రేమించుకుంటారు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు జాన్వి బర్త్‌డే పార్టీలో ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జాన్వి తో క్లోజ్ గా మూవ్ అవ్వటం చూసి అది తట్టుకోలేక పోతాడు. అదే టైంలో జాన్వి బెస్ట్ ఫ్రెండ్ ధరణి ఆదిని ఓదారుస్తూ ఏం చేయాలో తెలియక ముద్దుపెడుతుంది. అది జాన్వి చూసి తప్పుగా అర్థం చేసుకొని ఆదిని అందరి ముందు అవమానిస్తుంది. ఒంటిమీద బట్టలు కూడా నేను కొనిచ్చినవే అని బట్టలు విప్పి పంపిచేస్తుంది. ఆ అవమానంతో ఆది ఏం చేశాడు ? ఆది రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు ? జాన్వికి నిజం తెలుస్తుందా ? ధరణి ఏం చేసింది ? ఆది గోల్ ఏమైంది అన్నది తెలియాలంటే తెరమీద చూడాల్సిందే.

విశ్లేష‌ణ :
ఒక మామూలు ప్రేమ కథనే డైరెక్టర్ లోకల్ హైదరాబాద్ అబ్బాయికి ఇజ్జత్ ఉండాలి… లైఫ్‌లో ఎదగాలి అన్న కథాంశంతో ఈ బబుల్ గమ్ సినిమా తెరకెక్కించాడు. దర్శకుడు సినిమా ఫస్ట్ ఆఫ్ అంత హీరో క్యారెక్టర్.. హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాలు.. మధ్యలో స్నేహితులతో సరదా సన్నివేశాలు హీరో ఇంట్లో తండ్రితో తిట్టించుకోవ‌డాలు… కొన్ని కామెడీ సీన్లతో సాగిపోతుంది. ఇంటర్వెల్ కి ఆదికి జరిగిన అవమానంతో సెకండ్ హాఫ్ లో హీరో ఏం చేస్తాడు ? అని ఆసక్తి కలిగించేలా చేశాడు.. ఓ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మధ్య ప్రేమ, ముద్దులు, హగ్గులు, కొన్నాళ్ల‌కు గొడవలు ఇలా లవ్ స్టోరీలన్ని దాదాపు ఓకే లా ఉంటాయి.. సినిమా ఎలా ? తీసిన ఫైనల్ గా ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఇక్కడ పాయింట్.

ఈ విషయంలో బబుల్‌గ‌మ్‌ పాస్ అయిపోయింది. ఫస్టాఫ్ విషయానికొస్తే కేవలం చెడ్డితో బైక్‌పై హీరో అరుస్తూ.. ఏడుస్తూ హైదరాబాద్ రోడ్డుపై వెళ్లే సీన్తో సినిమా ఓపెన్ అవుతుంది. పక్కా హైదరాబాద్ కుర్రాడిగా ఆదిత్య ఎంట్రీ.. ఓ డీజే దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా పెద్ద డీజే కావాలని కలలు కనటం.. ఎప్పుడు తిట్టే తండ్రి ఏం చేసినా సపోర్ట్ చేసే తల్లి అనుకోకుండా జాన్వీని చూడటం.. ఆమెతో ప్రేమలో పడటం.. ఇలా పెద్దగా మెరుపులు లేకుండానే ఫస్ట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. దీంతో స్టోరీపై కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అసలు కథ‌ అంత సెకండాఫ్ లోని చూపిస్తారు. అప్పటివరకు ప్రేమ కథగా ఉన్నది కాస్త రివెంజ్ డ్రామాగా మారుతుంది.

ఫస్ట్ ఆఫ్ అంత సరదా సరదాగా ఉన్న హీరో, హీరోయిన్ సెకండ్ హాఫ్‌లో సిరీస్ డ్రామా పండిస్తారు. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కాస్త కన్ఫ్యూజన్ ఉన్న రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీలతో పోలిస్తే కాస్త డిఫరెంట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ అంత సాగదీసి వదిలిన డైరెక్టర్ సెకండాఫ్ మాత్రం మంచిగా తీశాడు. దీంతో ఫీల్ గుడ్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. కొత్త యాక్టర్లతో ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ తీస్తున్నప్పుడు కాస్త రిస్క్ ఎక్కువే.. అయితే డైరెక్టర్ ఈ విషయంలో పాస్ అయిపోయాడు. అలాగే ల‌స్ట్ తప్ప పెద్దగా ఎమోషన్ లేకుండా సాగిపోయే లవ్ ట్రాక్, అక్కడక్క బూతు డైలాగులు ఇబ్బందిగా అనిపిస్తాయి.

న‌టీన‌టుల పెర్పామెన్స్ & టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
హీరోగా చేసిన సుమ కొడుకు రోషన్ కన‌కాలకు ఇదే తొలి సినిమా అయిన ఆకట్టుకున్నాడు. ప‌క్కా హైదరాబాదీ కుర్రాడు పాత్రలో అలా ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్ని బాగున్నాయి. తొలి సినిమాతోనే ఈ మాత్రం అవుట్ ఫుట్ ఇచ్చాడంటే మంచి ఫ్యూచర్ ఉన్నట్టే అనుకోవాలి. హీరోయిన్ మానస చౌదరి కూడా బాగుంది. రొమాంటిక్ సీన్లలో బాగా రెచ్చిపోయింది. మిగిలిన సీన్ల‌ల్లో పర్వాలేదనిపించింది. హీరో తండ్రి క్యారెక్టర్ చేసిన చైతు జొన్నలగడ్డ మంచి కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశాడు. హర్షవర్ధన్, అనూహసన్ లాంటి సీనియర్లు ఉన్న పెద్దగా సీన్లు పడలేదు.

టెక్నికల్ గా చూస్తే క్షణం, కృష్ణ అండ్ లీల సినిమాలతో దర్శకుడుగా మెప్పించిన రవికాంత్ పేరేపు బబుల్‌గ‌మ్‌ సినిమా విషయంలో కాస్త క్లారిటీ మిస్ అయ్యాడు. కానీ కొత్త నటీనటులు అయిన రోషన్, మానస దగ్గర నుంచి మంచి యాక్టింగ్ రాబట్టుకున్నాడు. ఇందులో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. జిలేబి పాట బాగుంది. నేపథ్య సంగీతం బాగున్న కొన్ని సీన్లలో మ్యూజిక్ డామినేట్ చేసినట్టు ఉంది. సురేష్ రగుతూ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా…
ఒక మాటలో చెప్పాలంటే యూత్ ఫుల్ ప్రేమ కథ చూడాలనుకుంటే బబుల్గ‌మ్‌ ట్రై చేయొచ్చు.

బ‌బుల్‌గ‌మ్ రేటింగ్‌: 2.5 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news