News"అసలు జరిగింది ఏంటో.. నిజమెంటో వాళ్లకి తెలుసు".. విడాకుల పై నాగచైతన్య...

“అసలు జరిగింది ఏంటో.. నిజమెంటో వాళ్లకి తెలుసు”.. విడాకుల పై నాగచైతన్య సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగచైతన్య తాజాగా నటించిన వెబ్ సిరీస్ దూత . అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. కాగా చాలా కాలం తర్వాత సూపర్ హిట్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు నాగచైతన్య. ఈ క్రమంలోనే మీడియా మిత్రులతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

కాగ దీనికంటే ముందే సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరోక్షంగా తన విడాకులపై స్పందించాడు నాగచైతన్య . హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయంపై మాత్రం ఎవ్వరు క్లారిటీ ఇవ్వలేదు. కాగా దీనిపై పరోక్షంగా స్పందిస్తూ నాగచైతన్య మాట్లాడాడు.

“జనాలకి నా వర్క్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ పైన ఇంట్రెస్ట్ .. నాకు దగ్గరగా నన్ను క్లోజ్ గా వాచ్ చేసే వాళ్ళకి నిజమెంటో తెలుసు. నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. నేను లైఫ్ లో ఏ విషయాన్ని అయినా అక్కడితోనే వదిలేస్తాను ..ఇప్పుడు కూడా ఎక్కడిది అక్కడే మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను .. నా లైఫ్ లో నేను ముందుకెళ్లడానికి చూస్తున్నాను. సినిమాల పరంగా నా నుంచి ది బెస్ట్ వస్తుంది .. ఇక మీకు అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను “అంటూ మరోసారి విడాకుల విషయంపై పరోక్షకంగా స్పందించి తన తప్పు ఏమీ లేదు అంటూ చేతులు దులిపేసుకున్నాడు నాగచైతన్య..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news