News' అఖండ 2 ' ముహూర్తం వ‌చ్చేసింది... బాల‌య్య‌కు వ‌రుస‌గా ఐదో...

‘ అఖండ 2 ‘ ముహూర్తం వ‌చ్చేసింది… బాల‌య్య‌కు వ‌రుస‌గా ఐదో హిట్ ప‌క్కా…!

బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌ లో వచ్చిన అఖండ సినిమా అఖండ విజ‌యం సాధించింది. అఖండ నిజంగా బాల‌య్య కెరీర్‌కు తిరుగులేని ఊపిరి ఊదింది. అఖండ ఏకంగా 103 కేంద్రాల్లో 50 రోజుల‌తో పాటు 4 కేంద్రాల్లో డైరెక్టుగా 100 రోజులు ఆడింది. ఆ త‌ర్వాత అఖండ 175 – 200 రోజులు కూడా పూర్తి చేసుకుంది. అఖండ హిట్ అయ్యాక ఆ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 రాబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు.

అఖండ త‌ర్వాత బాల‌య్య వీర‌సింహారెడ్డి, ద‌స‌రాకు భ‌గ‌వంత్ కేస‌రి సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మూడు వ‌రుస హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అస‌లు ఇప్పుడు బాల‌య్య మామూలు ఫామ్‌లో లేడు. ఇటు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ టాక్ షో కూడా దుమ్ము లేపుతోంది. ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య త‌న 109వ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

బాబి సినిమా పూర్త‌యిన వెంట‌నే అఖండ 2 మొద‌ల‌వుతుంద‌ట‌. బోయ‌పాటి కూడా అఖండ 2 స్క్రిఫ్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడంటున్నారు. రామ్‌తో స్కంద సినిమా తెర‌కెక్కించిన బోయ‌పాటి ఆ సినిమాతో అంచ‌నాలు అందుకోలేదు. ఇప్పుడు అఖండ 2 క‌థ‌ను క‌సితో రెడీ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. వ‌చ్చే యేడాది ఆగ‌స్టు నుంచి అఖండ 2 సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంద‌ని తెలుస్తోంది.

ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో వినూత్న సినిమాగా అఖండ 2 రాబోతుంద‌ని అంటున్నారు. సినిమాలో యాక్ష‌న్ సీన్ల‌తో పాటు పొలిటిక‌ల్ పంచ్‌లు అదిరిపోతాయంటున్నారు. బాబి సినిమా లైన్ కూడా బాగుంది.. ఈ సినిమా హిట్ అయితే అఖండ 2 హిట్ అవ్వ‌డం లాంఛ‌న‌మే.. ఇలా బాల‌య్య‌కు వ‌రుస‌గా ఐదో హిట్ ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news