Newsఅభిరామ్ పెళ్లి వెన‌క ఇంత జ‌రిగిందా... సురేష్‌బాబు ఒప్పుకోలేదా...!

అభిరామ్ పెళ్లి వెన‌క ఇంత జ‌రిగిందా… సురేష్‌బాబు ఒప్పుకోలేదా…!

టాలీవుడ్‌లో ద‌గ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ తెలిసిందే. రామానాయుడు త‌ర్వాత ఆయ‌న ఇద్ద‌రు వార‌సులు సురేష్‌బాబు, వెంక‌టేష్ ఇద్ద‌రూ టాలీవుడ్‌లో స‌క్సెస్ అయ్యారు. సురేష్‌బాబు అగ్ర‌నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. ఇటు టాప్ డిస్ట్రిబ్యూట‌ర్ కూడా. ఇక వెంక‌టేష్ టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరో. ఇక సురేష్‌బాబు పెద్ద కుమారుడు రానా ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పాపుల‌ర్ అయిపోయాడు.

సురేష్‌బాబు రెండో కుమారుడు అభిరామ్ కూడా అహింస సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయ్యింది. తొలి సినిమా ప్లాప్‌తో అభిరామ్ రెండో సినిమా విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఓ కాఫీ షాఫ్ పెట్టిన అభిరామ్ సినిమాల‌తో పాటు బిజినెస్ విష‌యంలోనూ ప్లాన్‌గా ముందుకు వెళుతున్నాడు.

ఇక అభిరామ్ పెళ్లి కుదిరింది. ప్ర‌కాశం జిల్లాకు చెందిన ప్ర‌త్యూష చాప‌రాల‌తో క‌లిసి జీవితంలో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. ఇది సురేష్‌బాబు కుదిర్చిన పెళ్లి. ప్ర‌త్యూష ద‌గ్గుబాటి కుటుంబానికి బంధువే. వీరిది ప్ర‌కాశం జిల్లాలోని కారంచేడు. అయితే అభిరామ్ ఇప్ప‌టికే కొన్ని ఎఫైర్లు న‌డిపి వార్త‌ల్లోకి ఎక్కాడు. శ్రీ రెడ్డి లాంటి వాళ్లు అభిరామ్ త‌న‌ను మోసం చేశాడ‌ని రోడ్డెక్కిన సంగ‌తి తెలిసిందే.

శ్రీరెడ్డిని ప‌క్క‌న పెట్టినా అభిరామ్ మ‌రో అమ్మాయిని ప్రేమించాడ‌ని.. ఆమె కూడా ఇండ‌స్ట్రీకే చెందిన అమ్మాయి అని.. అయితే అభిరామ్ పై కెరీర్ సినీ మ‌చ్చ ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో సురేష్‌బాబు త‌మ బంధువు అమ్మాయినే కోడ‌లిగా తెచ్చుకుంటున్నాడ‌ని టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news