Newsసురేఖావాణి, సుప్రీత ఇంత పెద్ద క‌న్నింగా... ప‌చ్చి బూతుల‌తో ఆడుకుంటున్నారుగా...!

సురేఖావాణి, సుప్రీత ఇంత పెద్ద క‌న్నింగా… ప‌చ్చి బూతుల‌తో ఆడుకుంటున్నారుగా…!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఆమె కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. సురేఖ వాణి గతంలో చాలా సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సురేఖ తన కూతురు సుప్రీతను కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన కూతురితో కలిసి రీల్స్‌ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తూ ఉంటారు. వీరిద్దరూ షేర్ చేసే ఫోటోలు హాట్ హాట్ ఫోటోలు, రిల్స్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

నాలుగున్నర ప‌దుల‌ వయసులో ఉన్న సురేఖ వాణి తన కూతురితో కలిసి హాట్ హాట్ గా ఫోటోలు పెడుతూ నానా రచ్చ చేస్తూ ఉంటుంది. అసలు ఒక్కోసారి బాలీవుడ్ హాట్ హీరోయిన్ లను మించి మరి వీళ్ళిద్దరూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ రీల్స్‌కు, వీరి ఫొటోల‌కు నెటిజ‌న్ల నుంచి దారుణ‌మైన కామెంట్లు రావడం.. వీళ్లు కౌంట‌ర్లు ఇస్తూ ఉండ‌డం కూడా జ‌రుగుతూ ఉంటుంది.

తాజాగా తెలంగాణ ఎన్నిక‌ల్లో ఈ త‌ల్లికూతుర్లు ఇద్ద‌రూ బీఆర్ఎస్ విజ‌యం సాధించాల‌ని రీల్స్ చేయ‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో వీడియోల ద్వారా బాగా స‌పోర్ట్ చేశారు. అయితే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. వెంట‌నే ఈ వీడియోలు తొల‌గించిన సుప్రీత తాను, త‌న త‌ల్లి సురేఖ రేవంత్‌రెడ్డితో క‌లిసి ఉన్న ఫొటో షేర్ చేసింది. దీంతో నెటిజ‌న్లు ఈ త‌ల్లీకూతుర్లు ఇద్ద‌రూ ప‌ర‌మ ఖ‌త‌ర్నాక్‌లు, ఖిలేడీలు, క‌న్నింగ్ అంటూ నెటిజ‌న్లు ఆడుకోవ‌డం మొద‌లు పెట్టారు.

వెంట‌నే ఈ ఫొటో డిలీట్ చేసిన సుప్రీత‌.. తాము బీఆర్ఎస్‌కు స‌పోర్ట్ చేశాం… అందులో త‌ప్పేం ఉంది… ఇప్పుడు గెలిచిన వ్య‌క్తికి శుభాకాంక్ష‌లు చెపుతున్నాం.. ఇంత మాత్రానికే ట్రోల్స్ చేయ‌డం ఏంటి ? మీరు చేసే ట్రోలింగ్ వ‌ల్ల నా మాన‌సిక ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని ద‌య‌చేసి అర్థం చేసుకోమ్మ‌ని పోస్ట్ పెట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news