Newsబిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: బన్నీ డైరెక్టర్ రణబీర్ కపూర్ నెక్స్ట్ సినిమా...

బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: బన్నీ డైరెక్టర్ రణబీర్ కపూర్ నెక్స్ట్ సినిమా ఫిక్స్.. యానిమల్ కి అమ్మ మొగుడులాంటి మూవీ పక్కా..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సినిమా ఇండస్ట్రీలో యానిమల్ సినిమాకి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా యానిమల్. రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది .

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేక అల్లాడిపోతున్న హీరోలకు ఈ సినిమా మంచి ఊపునిచ్చింది . అప్పటివరకు కేవలం చాలా రొమాంటిక్ చాక్లెట్ బాయ్ పాత్రలో కనిపించిన రణబీర్ కు ఈ సినిమా ఖచ్చితంగా నేషనల్ అవార్డు తెచ్చి పెడుతుంది అన్న కాన్ఫిడెన్స్ అందరిలోనూ నెలకొంది . అయితే రీసెంట్గా రన్బీర్ కపూర్ తెలుగు డైరెక్టర్ సినిమాకు ఓకే చేసినట్లు తెలుస్తుంది .

ఆయన మరెవరో కాదు సుకుమార్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారట . అంతేకాదు ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ప్లాన్ చేస్తున్నారట . పుష్ప తర్వాత అంతకుమించిన మాస్ రేంజ్ లో సుకుమార్ రన్బీర్ కపూర్ ని చూపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఒకవేళ అదే నిజమైతే మాత్రం రణబీర్ కపూర్ కెరియర్ లో ఇదొక మైల్ స్టోన్ గా మిగిలిపోతుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news