Moviesఆ ఒక్క షో కోసం సుమ ఏకంగా అన్ని వేల చీరలు...

ఆ ఒక్క షో కోసం సుమ ఏకంగా అన్ని వేల చీరలు కట్టిందా..? బుల్లి తెర చరిత్రలోనే సంచలన రికార్డ్ ఇది..!

యాంకర్ సుమ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . చిన్నపిల్లడి దగ్గర నుంచి మంచంలో ఉన్న పండు ముసలి వాళ్ళ వరకు ఈ పేరు బాగా తెలుసు. అంతలా బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ తన పేరుని పాపులారిటీ దక్కించుకుంది . కాగ యాంకర్ సుమ చాలా బిజీ బిజీగా ఉంటుంది ..అన్ని ఛానల్స్ కి సంబంధించిన షో స్ ను కవర్ చేస్తుంది . అలాగే ప్రముఖ హీరోల కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లను కవర్ చూస్తుంది .

ఇవన్నీ చాలామందికి తెలుసు. కానీ యాంకర్ సుమ తన యాంకరింగ్ పట్ల చాలా డెడికేషన్ తో ఉంటుంది . అందుకే ఆమెను ఎవరు బీట్ చేయలేకపోయారు . సుమ కారణంగా ఎన్ని షోలు సక్సెస్ఫుల్గా ఏళ్ల తరబడి టెలికాస్ట్ అయ్యాయో మనకు తెలిసిందే. కాగా సుమ చేసిన షో లలో ది బెస్ట్ ఎవర్గ్రీన్ టాప్ షో స్టార్ మహిళ . అప్పట్లో ఆడవాళ్ళని ఈ షో బాగా ఆకట్టుకునింది .

సుమారు 5000 ఎపిసోడ్స్ ప్రసారమైన ఈ షోలో ఆమె ఏకంగా 5 వేలకు పైగానే చీరలు కట్టుకున్నాను అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ షో తో పాటు మిగిలిన షోలకి కూడా 1500 చొప్పున మొత్తంగా 6500 చీరలు కట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది . అయితే వాటిని తన ఒంటిపై మాత్రమే పెట్టుకున్నానని ఇంటిలోకి తీసుకురాలేదు అని నవ్వుతూ చెప్పకు వచ్చేసింది . అంతేకాదు తన ఫస్ట్ శారీ గిఫ్ట్ పదవ తరగతిలో ఉన్నప్పుడు అందుకున్నానని ..తల్లి కొనిచ్చారు అని చీరతో ఉన్న స్పెషల్ బాండింగ్ గురించి చెప్పుకొచ్చింది సుమ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news