Moviesభూమా మౌనికకు పుట్టబోయేది ఆ బిడ్డేనా..? ట్వీట్ లో క్రేజీ హింట్...

భూమా మౌనికకు పుట్టబోయేది ఆ బిడ్డేనా..? ట్వీట్ లో క్రేజీ హింట్ ఇచ్చేసిన మనోజ్..ఫ్యాన్స్ కనిపెట్టేశారుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మనోజ్ అభిమానులకు రీసెంట్గా గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే . మంచు మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి ప్రెగ్నెంట్ . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న.. ఏం పట్టించుకోని మనోజ్ రీసెంట్గా అదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. భూమా మౌనిక రెడ్డి ప్రెగ్నెంట్ అంటూ ట్విట్టర్ వేదికగా ట్విట్ చేశాడు .

దివంగత భూమా శోభ , నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ తాతయ్య కాబోతున్నారు అంటూ ఎక్స్ ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు . “మా అత్తమ్మ భూమా పుట్టినరోజు వేళనే ఆమెను గుర్తు చేసుకుంటూ ఈ శుభవార్త చెబుతున్నాము అని ..అత్తమ్మ శోభ నాగిరెడ్డి మామయ్య భూమా నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ తాతయ్య కాబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు మనోజ్. అంతేకాదు భూమా మౌనిక రెడ్డి మొదటి కొడుకు ధైర్యవ్ అన్నయ్య కాబోతున్నాడు అని చాలా ధైర్యంగా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు .

అంతేకాకుండా తన తల్లి నిర్మల తండ్రి మోహన్ బాబు గారి ఆశీస్సులతో కుటుంబం అంతా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. మనోజ్ చేసిన ట్వీట్ ప్రకారం అభిమానులు ఆయనకు పుట్టబోయేది పాప నా..? బాబునా..? అనేది గెస్ చేస్తున్నారు . అత్తమ్మ భూమా పుట్టినరోజు నాడే ఈ విషయాన్ని చెప్పడంతో తన అత్తమ్మ మళ్ళి తన కడుపున పుట్టబోతుంది అని భూమా శోభ నాగిరెడ్డి ఆమె జన్మించబోతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరికొందరు భూమా నాగిరెడ్డి మరోసారి పుట్టబోతున్నాడు అని ఆనందపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో భూమా మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news