Newsఅప్పుడు శ్రీదేవి తీసుకున్న రెమ్యూనరేషన్ కి.. ఇప్పుడు జాన్వీ అందుకుంటున్న పారితోషకానికి..ఎంత...

అప్పుడు శ్రీదేవి తీసుకున్న రెమ్యూనరేషన్ కి.. ఇప్పుడు జాన్వీ అందుకుంటున్న పారితోషకానికి..ఎంత తేడా ఉందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్స్ ఏ విధంగా రెమ్యూనరేషన్ హై రేంజ్ లో ఛార్జ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం . నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మలు సైతం ఒక్కొక్క సినిమాకి మూడు నాలుగు కోట్లు తీసుకుంటున్నారు . సినిమా హిట్ అవుతుందా అంటే అది లేదు . తుస్సు మనిపోతుంది . రీసెంట్ గా జాన్వికపూర్ కి సంబంధించిన సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు .

అన్ని యావరేజే . అయితే జాన్వి కపూర్ రెమ్యూనరేషన్ మాత్రం స్టార్ హీరోయిన్లకు మించిపోయే రేంజ్ లోనే ఉంటుంది. ఒక్కొక్క ఫోటోషూట్ కి ఏకంగా కోటి రూపాయలు పైనే ఛార్జ్ చేస్తుందట . గతంలో హీరోయిన్ శ్రీదేవి తీసుకున్న రెమ్యూనిరేషన్ కి ఇది చాలా చాలా ఎక్కువ అంటున్నారు అభిమానులు . ఆఫ్ కోర్స్ ఒకప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది.

1990 మే 9న విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు గాను చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ కి దాదాపు సరిసమానంగా తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది శ్రీదేవి . అంతే కాదు శ్రీదేవి కెరియర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఈ సినిమాకి తీసుకున్నదే అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . అయితే శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించి అంత హై రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తే జాన్వి కపూర్ పట్టుమంటే 10 సినిమాల్లో కూడా నటించకుండానే ఐదు కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేయడం దారుణం అంటున్నారు జనాలు. ఈ విధంగా చూసుకుంటే శ్రీదేవికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రెట్ల రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకుంటుంది జాన్వి అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news