Newsయానిమల్ సినిమాలో కాజల్ అగర్వాల్ మిస్ చేసుకున్న పాత్ర ఏంటో తెలుసా..?...

యానిమల్ సినిమాలో కాజల్ అగర్వాల్ మిస్ చేసుకున్న పాత్ర ఏంటో తెలుసా..? సందీప్ కి ఇలాంటి ధాట్స్ ఎలా వస్తాయ్ రా నాయన..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యానిమల్ . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం వింటున్నాం. మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డి తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని తెరకెక్కించిన సినిమా ఇదే కావడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.

వాటిని ఏమాత్రం తగ్గించకుండా యానిమల్ సినిమాను అర్జున్ రెడ్డికి వంద రెట్లు పవర్ఫుల్గా బోల్డ్ గా తెరకెక్కించాడు సందీప్ రెడ్డివంగా . ఈ సినిమాలో కాజల్ కూడా ఓ పాత్ర చేయాల్సి ఉండింది. అయితే కాజల్ కావాలనే ఆ పాత్ర ను రిజెక్ట్ చేసింది . ఈ సినిమా లో రణబీర్ కపూర్ కి ఒక అక్క ఒక చెల్లి ఉంటారు .

అయితే రన్బీర్ కపూర్ కి అక్క పాత్రలో కాజల్ అగర్వాల్ ని అనుకున్నారట సందీప్ రెడ్డివంగా. అయితే కాజల్ ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . హీరోయిన్ గా ఛాన్సెస్ వస్తున్న ఈ టైంలో ఇలాంటి సిస్టర్ రోల్ కు ఓకే చెప్తే ఎక్కడ తన కెరీర్ దెబ్బతింటుందో అన్న భయంతో రిజెక్ట్ చేసిందట. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news