Moviesఓటు వేసి బ‌య‌ట‌కు వ‌స్తూ మ‌హేష్ భార్య న‌మ్ర‌త ఏం చేసిందో...

ఓటు వేసి బ‌య‌ట‌కు వ‌స్తూ మ‌హేష్ భార్య న‌మ్ర‌త ఏం చేసిందో చూడండి…!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ శాతం 70 దాటింది. విచిత్రం ఏంటంటే గ్రామీణ తెలంగాణలో ఓటర్లు పోటెత్తారు. చాలా నియోజకవర్గాల్లో 80కు పైగా పోలింగ్ శాతం జరిగింది. అయితే తెలంగాణకు గుండెకాయ లాంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం నగర జనాలు ఓటేసేందుకు అంత ఆసక్తి చూపించలేదు. నగర శివారులోని పలు నియోజకవర్గాలతో పాటు.. పాతబస్తీలో నియోజకవర్గాలు.. ఇటు సెలబ్రిటీలు ఎక్కువగా ఉండే కూకట్‌ప‌ల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ లాంటి నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా జరిగింది.

ఇంకా చెప్పాలంటే పోలింగ్ శాతం 50 లోపు మాత్రమే జరిగింది. విచిత్రం ఏంటంటే ఈసారి సినిమా సెలబ్రిటీలు క్యూలో నుంచొని మరి కుటుంబంతో సహా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు సినీ స్టార్స్ తమ భార్యలతో సహా క్యూలో ఉండి ఓటు వేసి ఓట్లు వేయటం మా బాధ్యత అని చాటి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన తల్లి శాలినితో కలిసి ఓటు వేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ – ఉపాసన దంపతులు పలువురు సినీ సెలబ్రిటీలు ఈసారి ఓట్లు వేశారు.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్ర‌త‌తో కలిసి మరి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో.. ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసి బయటకు వస్తున్న నమ్రత చాలా హ్యాపీగా తన మూమెంట్ వ్యక్తం చేసిన ఫొటో వైర‌ల్ అవుతోంది. తన చేతికి ఉన్న సిరా గుర్తు చూపిస్తూ తాను ఓటు వేశానని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ఈసారి టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఓటు వేయడంతో పాటు ప్రతి పౌరుడు ఓటు వేయవలసిన బాధ్యత నొక్కి చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news