News"యానిమల్" సినిమా సూపర్ డూపర్ హిట్..కడుపు మంటతో చచ్చిపోతున్న తెలుగు హీరో..ఎందుకంటే..?

“యానిమల్” సినిమా సూపర్ డూపర్ హిట్..కడుపు మంటతో చచ్చిపోతున్న తెలుగు హీరో..ఎందుకంటే..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ తెగ వైరల్ గా మారాయి . సినిమాకి సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మరి ముఖ్యంగా అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డివంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఫాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు .

చాలామంది టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు . అయితే తెలుగు హీరో మాత్రం ఈ సినిమా సక్సెస్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు . దానికి రీజన్ ఈ సినిమా కథను మహేష్ బాబు కన్నా ముందు ఈ హీరోతోనే అనుకోవడం . ఎస్ ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగ ఈ కథను ముందుగా మహేష్ బాబుకు వివరించారు అని ..ఆయన రిజెక్ట్ చేసారు అని.. మాత్రమే తెలుసు అయితే ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఒకటి ఉంది . మహేష్ బాబు కన్నా ముందు స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకుంటున్న తెలుగు హీరోకి ఈ కథను వివరించారట .

అయితే ఇంత వైలెన్స్ తెలుగు జనాలకు అస్సలు బుర్రకు ఎక్కదు అని అసలు ఈ సినిమా బాలీవుడ్ లో తప్పిస్తే ఎక్కడ పెద్దగా క్రేజ్ దక్కించుకోదు అని సినిమాను రిజెక్ట్ చేశాడు. అంతేకాదు మహేష్ బాబు ఈ సినిమా రిజెక్ట్ చేశాడు అని తెలిసి కూడా చాలా సంబరపడ్డాడు . అయితే రన్బీర్ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగులోకి పరిచయం అవుతున్నాడు ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కబోతున్నాడు అని వార్తలు చూసి తెగ నవ్వుకున్నాడు . సీన్ కట్ చేస్తే సినిమా రిజల్ట్ తర్వాత కుళ్ళుకొని ఏడ్చి చచ్చిపోతున్నాడు . ఇంత మంచి సినిమాను ఎలా వదులుకున్నానో..? అంటూ బాధపడిపోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది . మొత్తానికి ఏదో అనుకొని మరేదో ఊహించుకొని అడ్డంగా బుక్ అయిపోయాడు ఈ తెలుగు హీరో.. ఇక ఏడ్చిన ఏం ప్రయోజనం..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news