Newsరేణుదేశాయ్ - ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాగుడు మూత‌లు చూశారా...!

రేణుదేశాయ్ – ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాగుడు మూత‌లు చూశారా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ భౌతికంగా విడిపోయినా.. మానసికంగా ఎప్పుడు దగ్గరగా ఉంటున్నట్టుగానే కనిపిస్తారు. ఇప్పటికీ తమ అభిమాన హీరో భార్యగా.. తమ ప్రియమైన వదినగా చూస్తూ ఉంటారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ మరింత దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తోంది. పీపుల్స్ మీడియా సంస్థకు.. పవన్ కళ్యాణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే పీపుల్స్ మీడియా సంస్థకు జనసేనలో నెంబర్ 2 గా ఉన్న నాదెండ్ల మనోహర్‌కు మంచి స్నేహం ఉంది.

పీపుల్స్ మీడియా బ్యానర్లో పవన్ కళ్యాణ్ బ్రో సినిమా చేశారు. మరో విచిత్రం ఏంటంటే పీపుల్స్ మీడియా అధినేత కుటుంబానికి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. మొత్తం మీద ఇలా ఒక‌రితో ఒకరు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ ఇప్పుడు పీపుల్స్ మీడియాలోనే ఉంటున్నారు. తెలుగులో ఒక సినిమా చేయాలని ఆమె ప్లాన్ చేసుకుంటున్నారు. పీపుల్స్ మీడియా చాలా సినిమాలు నిర్మిస్తోంది.

అందులో ఒకటి రేణు దేశాయ్ చేస్తుందని తెలుస్తోంది. అందుకే పీపుల్స్ మీడియా ఆఫీస్‌లోనే ఓ క్యాబిన్ రేణు దేశాయికి కేటాయించారు. రేణు దేశాయ్ మంచి ముహూర్తం చూసుకుని క్యాబిన్ ప్రవేశం కూడా చేసి వెళ్లారు. ఇకపై ఆమె అక్కడే ఉంటూ తన సినిమా నిర్మాణ పనులు చూసుకుంటారని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కుమార్తె కూడా సినిమా నిర్మాణం మీద యాక్టివ్గా దృష్టి పెట్టారు.

ఇక ఇప్పుడు పీపుల్స్ మీడియాకు అటు పవన్ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్ తో పాటు ఇటు రేణు దేశాయ్ కూడా సన్నిహితంగా ఉండటాని బ‌ట్టి చూస్తే పవన్, రేణు మధ్య కూడా సంబంధాలు చాలా క్లోజ్ గా ఉన్నట్టు ఇండస్ట్రీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. అంటే పైకి మాత్రం వీరు విడిపోయినా.. మానసికంగా దగ్గరగా ఉంటూ జనాలతో దాగుడుమూతలు ఆడుతున్నట్టే కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news