Movies"సలార్" సినిమా హిట్ అయిన తర్వాత రాజమౌళి ఎందుకు ఒక్క మాట...

“సలార్” సినిమా హిట్ అయిన తర్వాత రాజమౌళి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదో తెలుసా..? అస్సలు రీజన్ ఇదే..!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా సలార్. డిసెంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది . 550 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డు దిశగా దూసుకుపోతుంది . అంతేకాదు ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో రాజమౌళి బాగా హంగామా చేశారు .

జనరల్గా ఏ సినిమాలను పెద్దగా పట్టించుకోని జక్కన్న ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఆయన సినిమాలను ప్రమోట్ చేయడానికి ఆయనకు హెల్ప్ చేశారు. ప్రశాంత నీల్ – పృథ్వీరాజ్ -ప్రభాస్లను ఇంటర్వ్యూ చేసి రకరకాల ప్రశ్నలతో మంచి హైప్ తీసుకొచ్చారు . అయితే సినిమా రిలీజ్ అయి దాదాపు వారం గడుస్తున్న సరే ఇప్పటివరకు జక్కన్న ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి మాటలు మాట్లాడలేదు .

సినిమా ముందు ఎలా మాట్లాడిన సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంది అని ఒక్క మాట మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . అయితే మహేష్ బాబు రాజమౌళి సినిమా విషయంలో బిజీగా ఉన్నాడని ఆ కారణంగానే సలార్ విషయం పట్టించుకోవట్లేదు అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం జక్కన్నకి కుళ్ళు అని.. ప్రశాంత్ నీల్ తనకంటే ఎక్కడ పాపులారిటీ దక్కించుకుంటాడో అని ఆయన ఏం మాట్లాడడం లేదని ప్రశాంత్ ఫాన్స్ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news