Newsఓరి దేవుడోయ్.. నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీలో .. ఆ...

ఓరి దేవుడోయ్.. నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీలో .. ఆ సీన్ విజయ్ – రష్మిక రిలేషన్ గురించేనా..?

సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో.. హీరోయిన్ రష్మిక మందన్నా.. హీరో విజయ్ దేవరకొండ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది వీళ్ళ రిలేషన్షిప్ ను వాడుకోవడానికి పలు సినిమాలలో వీళ్ళకు సంబంధించిన సీన్స్ యాడ్ చేస్తుంటే.. మరికొందరు ఏకంగా సినీ ప్రమోషన్స్ లో వాళ్ల ప్రైవేట్ ఫొటోస్ ని టెలికాస్ట్ చేస్తున్నారు .

రీసెంట్గా హాయ్ నాన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక విజయ్ ల ప్రైవేట్ ఫోటో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలో కూడా ఓ సీన్ వీళ్ళ గురించి తెరకెక్కించారు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా నటించిన సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో నేడు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది .

ఓ సన్నివేశంలో నితిన్ హీరోయిన్ ఇంటికి వెళ్ళగా అక్కడ ఇంట్లో వాళ్లంతా నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ అని తెలిసి రకరకాల ప్రశ్నలు వేస్తారు . సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణకు కోపం ఎక్కువ అంట కదా..? నిజంగానే కొడతాడా ..? పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుంది..? అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఇదే క్రమంలో విజయ్ – రష్మిక ల మధ్య ఏముంది అని నితిన్ ని అడుగుతారు. దీంతో నితిన్ జులైలోని నేనెట్టకుంటే నీకేంటన్నాయి అనే సాంగ్ పాడి .. ఎవరు ఏం చేస్తే మీకెందుకు ..? అంటూ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేస్తాడు . దీంతో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news