Newsనాని సేఫ్ అయ్యాడు... నితిన్‌ను కాపాడేది శ్రీలీల మాత్ర‌మే...!

నాని సేఫ్ అయ్యాడు… నితిన్‌ను కాపాడేది శ్రీలీల మాత్ర‌మే…!

దేశవ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి ఎంతో హడావుడి నడిచిన యానిమల్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఇటీవల కాలంలో ఈ సినిమాకు వచ్చినంత బజ్‌.. జరిగినంత హడావుడి.. మరే సినిమాకు జరగలేదు. గత మూడు నెలలుగా చాలా సులువుగా ఉన్న బాక్సాఫీస్ కు ఈ యానిమల్ సినిమాతో ఒక్కసారిగా మంచి ఊపు వచ్చింది. ప్రతి ఊరిలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లో పెట్టడం.. చివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు పల్లెటూర్లలో సైతం రెండు స్క్రీన్‌లు ఉంటే రెండు స్క్రీన్‌లలోను తొలిరోజు యానిమల్ షోలు ప్రదర్శించడం.. ఎన్ని షోలు వేసిన హౌస్ పూల్స్ కావటం.. చూస్తే జనాలకు ఈ సినిమా పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో తెలిసింది.

రణ్‌బీర్ కపూర్ సినిమాకు మన దగ్గర ఈ రేంజ్ హడావుడిన అని జనాలు ఆశ్చర్యపోయారు. సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు డిసెంబర్ తొలి వారంలో థియేటర్లోకి వస్తున్న నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల పరిస్థితి ఏంటి అన్నది కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. యానిమల్ సినిమా కింది సెంటర్లలో ఆడుతుందా.. ఆడదా.. యూత్ బాగా కనెక్ట్ అవుతారా ? లాంటి ప్రశ్నలు అలా ఉంటే.. ఫ్యామిలీలు మాత్రం ఈ సినిమాకు దూరంగా ఉంటారు అనే టాక్‌ వచ్చేసింది. సినిమాలో ఉన్న కొన్ని సీన్లు, విరివిగా ఉన్న బూతులు అన్ని బయటకు తెలిసిపోయాయి.

దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ యానిమల్ సినిమాకు దూరంగా ఉంటారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇది నాని హాయ్ నాన్న సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. ఎందుకంటే నాని సినిమాకు ఉన్న ప్రధాన బలం ఫ్యామిలీ ఆడియన్స్. అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ మరో నాలుగు, ఐదు రోజులు సినిమాకు దూరంగా ఉండి.. నాని సినిమా కోసం వెయిట్ చేస్తారు. దీంతో నాని కాస్త.. యానిమల్ సినిమా సూపర్ హిట్ అయిన సేఫ్ అనుకోవాల్సిందే. అయితే ఇక్కడే మరో సమస్య కూడా ఉంది. యానిమల్ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయితే.. నాని సినిమాను పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది.

ఈ జనరేషన్ యూత్ సున్నితమైన భావోద్వేగాల కంటే ఎక్కువగా స్పీడ్‌, యాక్ష‌న్‌ నేరేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏది ఏమైనా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం నాని సినిమా రెడీగా ఉంది. ఇక నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన టాక్‌ను బట్టి జనాలు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలా ఉండటం ప్లస్ గానే ఉంది. నితిన్ సినిమా భారం పూర్తిగా శ్రీలీల‌ మీదే ఉందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news