MoviesRRR సినిమాకి తీసుకున్న నిర్ణయం "సలార్" కి తీసుకుని ఉండి ఉంటే.....

RRR సినిమాకి తీసుకున్న నిర్ణయం “సలార్” కి తీసుకుని ఉండి ఉంటే.. ప్రభాస్ ఉ* పోయించి ఉండేవాడు..జస్ట్ మిస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ రెబల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . 2023వ సంవత్సరానికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రభాస్ నటించిన సలార్ . ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా బాహుబలి తర్వాత అస్సలు హిట్టుకొట్టని ప్రభాస్ కు ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు నెలకొల్పింది .

ఇదే మూమెంట్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఏపీ గవర్నమెంట్ చేసినట్లు సలార్ సినిమా విషయంలో చేసి ఉంటే ప్రభాస్ సినిమా రికార్డ్స్ సృష్టించుండేదని చెప్పుకొస్తున్నారు . ఆర్ఆర్ఆర్ సినిమా టైంలో ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ బాగా పెంచేసింది. ఆ విధంగా ఇప్పుడు కానీ సలార్ విషయంలో టికెట్లు రేట్లు పెంచుంటే కచ్చితంగా అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఉండేది సలార్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

జస్ట్ 40 రూపాయల పెంపు మాత్రమే ఇచ్చారని ..అంత తక్కువ రేట్ లోను చాలా చాలా ఎక్కువ కోట్లు కలెక్ట్ చేయడం నిజంగా గ్రేట్ అని చెప్తున్నారు . అంతేకాదు ప్రభాస్ సలార్ విషయంలో ఏపీ గవర్నమెంట్ కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఉంటే ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసి నెంబర్ వన్ స్థానంలో ఉండేవాడని ..ఇంకా ఎక్కువ రికార్డ్స్ బ్రేక్ చేసి ఉండేవాడని అంటున్నారు.

సలార్ బాగానే కలెక్ట్ చేసిన కొన్ని కొన్నిచోట్ల పాత రికార్డులను సలార్ బద్దలు కొట్టలేక పోయిందని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు తెలంగాణలో అదనపు ఆటలు అదనపు రేట్లు స్పెషల్ షోలు 2000 టికెట్లు ఇవన్నీ కలిసి సినిమాకు రెండు రోజుల్లోనే 30 కోట్ల కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి . నైజాం ఆంధ్ర రెండిటిని కంపేర్ చేసి చూస్తే ఆంధ్ర కుసింత తక్కువగానే ఉంది అంటున్నారు జనాలు . దానికి కారణం జస్ట్ టికెట్ రేట్లు తేడా అని అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news