Moviesఆ ఒక్క తప్పు చేయకుండా ఉండుంటే .."డెవిల్" మరో బింబిసారా అంత...

ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండుంటే ..”డెవిల్” మరో బింబిసారా అంత హిట్ అయి ఉండేదా ..? మిస్ చేసుకున్నావ్ కళ్యాణ్ రామ్..!!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన సినిమా “డెవిల్”. మలయాళీ బ్యూటీ సంయుక్త ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది . ఫుల్ టు ఫుల్ పిరియాడిక్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి అభిమానులను ఆకట్టుకుంటుంది . అలాంటి హిట్ కోసం ట్రై చేసిన కళ్యాణ్ రామ్ కి అమిగోస్ నిరాశ మిగిల్చింది. ఖచ్చితంగా అలాంటి హిట్ డెవిల్ తో వేసుకుంటాడు తన ఖాతాలో అంటూ ధీమా వ్యక్తం చేశాడు కళ్యాణ్ రామ్ .

అయితే ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అందుకోలేకపోయింది. డెవిల్ పై గట్టి నమ్మకంతో ఉన్న కళ్యాణ్ రామ్ కి పాజిటివ్ కామెంట్స్ అయితే దక్కాయి .కానీ బింబిసారా అంత క్రేజ్ మాత్రం రాలేకపోయింది. ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి . ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు ..అంతే కాదు కళ్యాణ్ రామ్ నటన ఈ సినిమాకి హైలైట్ . సంయుక్తా మీనన్ కూడా చాలా బాగా నటించింది .

అంతేకాదు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మతులు పోతాయి . ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉంటుంది. అంతా బాగానే ఉన్నా కానీ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం జనాలు గెస్ చేసే విధంగానే ఉంది . అబ్బ ఏదో జరగబోతుంది అని అనుకునే లోపే చూస్తూ చూస్తూ క్లైమాక్స్ ను లాగేసి క్లోజ్ చేసేసాడు డైరెక్టర్ . ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే కచ్చితంగా ఈ సినిమా కూడా బింబిసారా అంత హిట్ అయి ఉండేది అంటున్నారు అభిమానులు. మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు కళ్యాణ్ రామ్ . చూద్దాం ఫస్ట్ డే సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news