News' ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ' ప్రి రిలీజ్ బిజినెస్‌... నితిన్...

‘ ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… నితిన్ హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు కొట్టాలో తెలుసా..!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా డైరెక్టర్ వక్కంతం వంశీ రచన, దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. నితిన్ జోడిగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల‌ హీరోయిన్గా నటించిన ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈరోజు నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా రిలీజ్ అవుతుండగా.. రేపు నితిన్ ఆర్డినరీ మ్యాన్ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక రోజు తేడాలో నాని సినిమాతో నితిన్ పోటీగా థియేటర్లలోకి వస్తున్నాడు.

విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు మిడిల్ రేంజ్ హీరోల సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ కాస్త అటు ఇటుగా ఒకేలా జరిగింది. నాని సినిమాకు రు. 27 కోట్ల థియేటర్ల బిజినెస్ జరిగితే.. నితిన్ సినిమాకు 24 కోట్ల రూపాయల ధియేటర్ బిజినెస్ జరిగింది. ఇది నితిన్ కు సొంత సినిమా. నితిన్ గత సినిమా మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ దగ్గర అంతగా వసూళ్లు రాబట్టలేదు. అయినా కూడా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఎక్కువ బిజినెస్ చేసింది.

ఈ సినిమాలో రాజశేఖర్, హైపర్ ఆది, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హరీష్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇప్ప‌టికే రిలీజ్ పాట‌ల‌కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. బుకింగ్స్ కూడా బాగున్నాయి. మ‌రి నితిన్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడ‌తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news