Moviesహీరోయిన్ సమంత ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలుసా..? స్క్రీన్ షాట్...

హీరోయిన్ సమంత ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలుసా..? స్క్రీన్ షాట్ తీసి మరీ చూపించిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా .. సమంత పేరు చెప్తే జనాలకు అదో తెలియని కిక్కు వస్తుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ అమ్మడు సినిమాలకు బ్రేక్ పెట్టిన సరే ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు , రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతూనే వస్తుంది . కాగా రీసెంట్గా మయోసైటిస్ వ్యాధి కారణంగా బాధపడుతున్న ఆమె చాలా రోజుల తర్వాత అభిమానులతో చిట్ చాట్ చేసింది.

ఈ క్రమంలోని ఇంస్టాగ్రామ్ ద్వారా పలువురు ఫాన్స్ ఆమెను రకాల రకరకాల ప్రశ్నలతో విసిగించేశారు. కానీ సమంత ఓపికగా సమాధానం చెప్పింది. వచ్చే సంవత్సరం మీరు కోరుకునే ఒక విషయం చెప్పండి అని అడగగా.. మంచి ఆరోగ్యం ఉండాలి అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాదు మరో నెటిజన్ ” సమంత మీ ఫోన్ వాల్ పేపర్ ఏంటి ..?” అని అడగ్గా …

సామ్ తన ఫోన్ వాల్ పేపర్ ని స్క్రీన్ షాట్ తీసి మరీ పెట్టింది . ఆ ఫోటోలో లింగ బైరవి అమ్మవారు ఉన్నారు. కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ లో ఉండే లింగ బైరవి అమ్మవారి ఫోటోని సమంత తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకుంది. సమంత కి భక్తి చాలా ఎక్కువ. టైం దొరికితే చాలు ఎక్కువుగా దైవ దర్శనాలకి వెళ్లిపోతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news