Newsరెమ్యూనరేషన్‌తో ముంచేస్తున్న మెగాస్టార్.. చిరంజీవికి అంత సీన్ లేద‌ని డిసైడ్ అయిన...

రెమ్యూనరేషన్‌తో ముంచేస్తున్న మెగాస్టార్.. చిరంజీవికి అంత సీన్ లేద‌ని డిసైడ్ అయిన దిల్ రాజు..!

మెగాస్టార్ చిరంజీవి అంటే ఒకప్పుడు టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ ఉండేది. చిరంజీవి ఇమేజ్‌ని ఇప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు. తనదైన రోజున ఆయన ఎలాంటి అద్భుతాలు అయినా చేస్తారు. పదేళ్ల గ్యాప్‌ తర్వాత రీఎంట్రీ ఇచ్చాక.. చిరంజీవి నటించిన సినిమాలు ఎక్కువ డిజాస్టర్లు అయినా.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య‌ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు ద‌క్కించుకుని ఈ వయసులోనూ తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి ఇప్పటివరకు 5 సినిమాలు చేస్తే అందులో ఒక వాల్తేరు వీర‌య్య‌ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మిగిలిన సినిమాలు ఏవీ నిర్మాతలకు భారీ లాభాలు అందించలేదు. దీనికి కారణం చిరంజీవి ఈ వయసులోనూ ప్రయోగాత్మక పాత్రలతో కూడిన సినిమాలు చేయకుండా రొటీన్, కమర్షియల్ జోనర్ లోనే.. రొటీన్ ఫార్మాట్ కథ‌లతో సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ ఇమేజ్ ఫ్యాన్స్‌ని థియేటర్లకు రప్పించినా.. ఆ తర్వాత సినిమా సక్సెస్ చేయడంలో ఆడియన్స్ ని ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోతోంది.

అయితే మెగాస్టార్ ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు రమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య హిట్ అయ్యాక భోళా శంకర్ సినిమాకు ఏకంగా రూ.65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవడంతో చిరంజీవి చివరకు రూ.55 కోట్లతో సరిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు నటిస్తున్న సినిమాలకు కూడా ఏకంగా రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్ అంటే.. మిగిలిన క్యాస్టింగ్ క్రూ ఇవన్నీ కలిపి రెమ్యూనరేషన్ రూ.70 కోట్లు దాటుతోంది.

దీంతో మెగాస్టార్ సినిమాల బడ్జెట్ రూ.130 నుంచి రూ.150 కోట్ల మధ్యలో ఉంటుంది. అయితే ఒకప్పటిలా చిరంజీవి సినిమాలు లాంగ్ కలెక్షన్లు రాబట్ట లేకపోతున్నాయి. దీంతో ఈ బడ్జెట్ రికవరీ చాలా కష్టం అవుతుంది. ఇటీవ‌ల‌ కాలంలో చిరంజీవి సినిమాలుకు ఓటిటి మార్కెట్ కూడా తగ్గిపోయింది. చిరంజీవి సినిమాలకి అంతగా ఓటీటీ రైట్స్ కూడా రావటం లేదు. ఈ లెక్కలన్నీ చూసుకుని చిరంజీవి మీద భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. అయితే మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడానికి కారణం కథ‌లో దమ్ము ఉండటమే అని తెలుస్తోంది.

చాలా కొత్తదనం ఉన్న కథ‌.. కద‌నంతో విశ్వంభర సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ విషయంలో మాత్రం నిర్మాత దిల్ రాజు చిరంజీవికి ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కొంత ఆలోచనలో పడినట్లు టాక్. చిరంజీవి మీద రూ.130 కోట్ల పెట్టుబడి పెట్టి అంత రికవరీ చేయటం చాలా కష్టం అని దిల్ రాజు ఆ ప్రాజెక్టు విషయంలో వెనక ముందు ఆడుతున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news