Newsఎన్టీఆర్ ' దేవ‌ర‌ ' లో మ‌రో ఇద్ద‌రు స్టార్ హీరోలు......

ఎన్టీఆర్ ‘ దేవ‌ర‌ ‘ లో మ‌రో ఇద్ద‌రు స్టార్ హీరోలు… మొత్తం ఎంత‌మంది హీరో, హీరోయిన్లు అంటే…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దేవర సినిమాను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచి రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.

రూ.300 కోట్ల భారీ బడ్జెట్ కాగా రెండు పార్ట్‌లుగా దేవ‌ర‌ తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాత‌గా ఉన్నారు. అటు కొర‌టాల బెస్ట్ ఫ్రెండ్ మిక్కిలినేని సుధాక‌ర్ మ‌రో నిర్మాత‌. ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ మామూలుగా లేదు. ఎన్టీఆర్ హీరో, హీరోయిన్గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. మరో హీరోయిన్ పాత్ర కోసం మరో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిశాపఠానీని హీరోయిన్గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే విలన్ గా బాలీవుడ్ క్రేజీ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

ఇక పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని మరో బాలీవుడ్ స్టార్ హీరో కోసం స్పెషల్ పాత్ర దర్శకుడు కొరటాల శివ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో కాదు సంజయ్ దత్. ఇటీవల వచ్చిన హీరో విజయ్ లియో సినిమాలోను సంజయ్ దత్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేవర సినిమాలో పాన్ ఇండియా మార్కెట్ కోసం సంజయ్ దత్‌ను కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇలాంటి స్టార్ కాస్టింగ్ తో దేవర సినిమాకు పాన్ ఇండియా ఆప్పీల్ మామూలుగా లేదని చెప్పాలి. ఇక గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఇప్పుడు దేవర సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. వచ్చేయేడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న దేవర ఒకేసారి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాష‌లో రిలీజ్‌కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news