Newsబ‌క్క‌ప‌ల్చ‌ని శ్రీలీల ఆ హీరోను మోయ‌గ‌ల‌దా... !

బ‌క్క‌ప‌ల్చ‌ని శ్రీలీల ఆ హీరోను మోయ‌గ‌ల‌దా… !

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది క్రేజీ బ్యూటీ శ్రీ‌లీల ఆమె నటించిన ఒకటి రెండు సినిమాలు ఫెయిల్ అయితే పెద్దగా ఆమె కెరీర్ పై ప్రభావం చూపలేదు. ప్రతి సినిమాలోను.. హీరో తర్వాత ఆమె నెంబర్ 2 గా దూసుకుపోతోంది. అయితే కమర్షియల్ సినిమాలలో హీరోకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ పై ప్రభావం ఉంటుంది. కానీ తొలిసారిగా శ్రీ‌లీలపై చాలా భారం పడింది. ఓ సినిమాను తానే మోయాల్సి వస్తోంది. ఆ సినిమా మెగా హీరో వైష్ణవ్‌తేజ్ న‌టించిన ఆదికేశవ. ఈ సినిమాలో వైష్ణవ తేజ్ సరసన శ్రీ‌లీల హీరోయిన్గా నటిస్తోంది.

వాస్తవానికి ఇది శ్రీ‌లీల కెరీర్‌ స్టార్టింగ్ లో తీసుకున్న అడ్వాన్స్. ఆదికేశవ గ‌త రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చి ఎట్టకేలకు ఇప్పుడు విడుదలవుతుంది. ప్రస్తుతం శ్రీ‌లీల క్రేజ్ మామూలుగా లేదు. అటు వైష్ణవ్ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఉప్పెన‌ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు. చేసిన రెండు సినిమాలు పెద్ద డిజాస్టర్‌లు. దీంతో ఇప్పుడు ఆదికేశవ భారం మొత్తం వైష్ణవ్‌ కంటే శ్రీ‌లీల మీదే పడింది.

ఈ సినిమా ప్రచారం మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్ కేవలం శ్రీలీల మాత్రమే. హీరో ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగోలేదు. పైగా డైరెక్టర్ కొత్త స్టార్, మ్యూజిక్ డైరెక్టర్ లేడు, ప్యాడింగ్‌ కూడా అంతంత మాత్రమే ఉంది. ఇక ఈ సినిమాకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా కేవలం శ్రీ‌లీల క్రేజ్‌ చూసి జరిగిందని అంటున్నారు. సినిమా మొత్తానికి శ్రీలీల‌ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

స్కంధ‌ సినిమాతో ఫ్లాప్ అందుకుంది శ్రీ‌లీల. ఆ వెంటనే భగవంత్ కేస‌రి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఆదికేశవ సినిమా హిట్ అవ్వాలంటే భారం మొత్తం బక్కపల‌చని భామ అయిన‌ శ్రీ‌లీల మోయాల్సిందే. మ‌రి శ్రీలీల త‌న ఛ‌రిష్మాతో పెళ్లిసంద‌డి సినిమాలా ఆదికేశ‌వ‌ను కూడా హిట్ చేస్తే ఆమె మిగిలిన హీరోయిన్లు అంద‌రిని దాటుకుపోతుంద‌న‌డంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news