Newsఉదయ కిరణ్ ద‌మ్మేంటో ఆ సినిమాతో టాలీవుడ్‌కు అర్థ‌మైందా... అది ఓ...

ఉదయ కిరణ్ ద‌మ్మేంటో ఆ సినిమాతో టాలీవుడ్‌కు అర్థ‌మైందా… అది ఓ ప్లాప్ సినిమాతో…!

చిన్న వ‌య‌స్సులోనే స్టార్ హీరో.. అనతి కాలంలోనే తిరిగిరాని లోకాలకి వెల్లిన హీరో ఉదయ్ కిరణ్. ఇదే ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో గానీ, కొందరు కామన్ ఆడియన్స్ గానీ, కామన్ ఆడియన్స్ గానీ అనుకునేది. అసలు విషయం ఏంటో ఆ దేవుడికే తెలియాలి. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు ఉదయ కిరణ్. ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో ఏకంగా స్టార్ ఇమేజ్ సాధించాడు.

ఆ తర్వాత అగ్ర నిర్మాత ఎంఎస్.రాజు నిర్మించిన మనసంతా నువ్వే సినిమాతో హ్యాట్రిక్ హీరోగా మారాడు. దాంతో ఏ సినిమా ఉన్నా ఉదయ్ కిరణ్ సినిమా రిలీజ్ అంటే మేయిన్ థియేటర్స్ అన్నీ అతనికే ఇచ్చేవారు. అవతల ఉన్నది పెద్ద హీరో పెద్ద దర్శకుడి సినిమా అయినా డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ ఇచ్చేవారు కాదు. అలాంటి సందర్భాలు ఉదయ్ కిరణ్ నటించిన హోళి సినిమాకి జరిగింది.

ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవీ థియేటర్ లో రిలీజ్ అయింది. అయితే, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన త్రినేత్రం సినిమా కూడా అదే రోజున విడుదల కావాల్సింది. అగ్ర దర్శకుడు, అగ్ర నిర్మాత, అప్పటికే రాశి మంచి ఫాంలో ఉన్న హీరోయిన్. కానీ, ఉదయ్ కిరణ్ వెనకాల నాలుగు సూపర్ హిట్స్ ఉన్నాయి. అంతే, కానీ, ఎదురుగా ఉంది శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ.

అయినా ఆయన సినిమాకి దేవీ థియేటర్ ఇవ్వనన్నారట. ఫాంలో ఉన్న క్రేజీ హీరో. వరుస బ్లాక్ బస్టర్ ఉన్నాయి. కాబ‌ట్టి కోడి రామకృష్ణ సినిమా త్రినేత్రం కి కాకుండా ఉదయ్ కిరణ్ నటించిన హోళి సినిమాకి దేవీ అలాట్ అయింది. దాంతో త్రినేత్రం సినిమా రిలీజ్ డేట్ నే ఏకంగా మార్చుకున్నారు. అంతటి క్రేజ్ ఉన్న హీరోగా వెలిగాడు ఉదయ్ కిరణ్. అయితే ఇటు ఉదయ్ హోళి.. ఆ తర్వాత వచ్చిన త్రినేత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news