Newsఇంటికి వచ్చి "బొమ్మరిల్లు" కధ చెప్పిన ..సినిమా హిట్ అవుతుంది అని...

ఇంటికి వచ్చి “బొమ్మరిల్లు” కధ చెప్పిన ..సినిమా హిట్ అవుతుంది అని తెలిసినా.. రిజెక్ట్ చేసిన పాన్ ఇండియా హీరో ఇతనే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చినా.. కొన్ని కొన్ని సినిమాలకు బ్రేక్ అంటూ పడదు . ఆ సినిమాలు వచ్చి సంవత్సరాలు అవుతున్న దశాబ్ద కాలాలు దాటుతున్న ఇప్పటికీ టీవీలో కానీ ఆ సినిమాను చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది . అలాంటి సినిమాలలో ఒకటే బొమ్మరిల్లు . సిద్ధార్ధ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది .

మరీ ముఖ్యంగా యువతకు ఈ సినిమా తెగ నచ్చేసింది . యువతతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ సినిమాను బాగా లైక్ చేశారు . అంతమంది జనాలకు ఈ సినిమా నచ్చడానికి కారణం కథ. ప్రతి కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య ఉండే ఇబ్బందులను .. చాలా చక్కగా చిత్రీకరించాడు దర్శకుడు భాస్కర్. అయితే ఈ సినిమాను మొదటగా ఎన్టీఆర్ తో తెరలెక్కించాలనుకున్నాడట భాస్కర్.

ఆ విషయం దిల్ రాజుకు చెప్తే దిల్ రాజు స్వయాన ఎన్టీఆర్ కి పరిచయం చేశారట . ఎన్టీఆర్ కథ మొత్తం విన్నాక నాకు సినిమా నచ్చింది కానీ కొన్ని సీన్స్ మారిస్తే ఇంకా బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట. తను రాసుకున్న కథలు మార్చడం ఇష్టం లేని భాస్కర్.. ఈ సినిమాను వేరే హీరోతో చేయాలి అని సిద్ధార్థ్ తీసుకున్నాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా మంచి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నాడు తారక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news