Newsపూజాహెగ్డేను అంత‌లా ట్రై చేసిన టాలీవుడ్ డైరెక్ట‌ర్‌... తివిక్ర‌మ్ కంటే ముందే...

పూజాహెగ్డేను అంత‌లా ట్రై చేసిన టాలీవుడ్ డైరెక్ట‌ర్‌… తివిక్ర‌మ్ కంటే ముందే వాడేశాడే..!

పూజా హెగ్డే..ఉవ్వెత్తున ఎగిసిపడి అలా సేద తీరుతున్న కెరటంలా పడి ఉంది. ముకుంద, ఒక లైలా కొసం సినిమాలతో టాలీవుడ్ లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. కొద్దిలో కొద్దిగా ఒక లైలా కోసం నయం. కాస్త పూజా హెగ్డేని చూడాలనిపిస్తుంది. అయితే, ఇక్కడ రెండు సినిమాలు చేసిందో లేదో పోలోమంటూ బాలీవుడ్ కి చెక్కేసింది.

మళ్ళీ తెలుగు సినిమా అనేది ఒప్పుకోకుండా హృతిక్ రోషన్ తో మొహంజాదారో సినిమా కోసం రెండేళ్ళు టైమిచ్చింది. ఆ సినిమా హిట్ అయితే అసలు టాలీవుడ్ జనాలని, మేకర్స్ ని కన్నెత్తి కూడా చూసేది కాదు. పూజా బ్యాడ్ లక్ హిందీలో చేసిన మొదటి సినిమా డిజాస్టర్ అయింది. దాంతో అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఇలాంటి హీరోయిన్స్ కి లైఫ్ ఇవ్వడానికే మన ఇండస్ట్రీలో దిల్ రాజు, హరీష్ శంకర్ లాంటి దర్శకులుంటారు.

దువ్వాడ జగన్నాధం సినిమాతో పూజాకి మళ్ళీ తెలుగులో ఛాన్స్ ఇచ్చారు. హరీష్ ఏకంగా పూజని బికినీలో చూపించి టాలీవుడ్ జనాలకి వెర్రెక్కించాడు. బికినీలో పూజా తొడలు, పొడుగు కాళ్ళు చూసి కళ్ళు బైర్లు కమ్మాయి. అంతే, ఆమెకి హిట్స్ లేకపోయినా అవకాశాలు ఇస్తూనే వచ్చారు. అలా ఆదరించిన టాలీవుడ్ జనాలను, మేకర్స్ ని వల్గర్ గా కామెంట్స్ చేసింది.

హిట్స్ వచ్చిన పూజాకి ఫ్లాప్స్ రావడంతో ప్రస్తుతం ఏ సినిమాకి తీసుకోవాలనుకున్నా అలోచిస్తున్నారు. ఇప్పుడు గనక మళ్ళీ హరీష్ శంకర్ పూజాకి ఛాన్స్ ఇస్తే తిట్టని వాళ్ళు ఉండరు. అందుకే, రవితేజ తో హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్న సినిమాకి పూజా వద్దని ముందుగానే నిర్మాతలు చెప్పేశారట. దాంతో కంప్లీట్ గా కొత్త అమ్మాయిని ట్రై చేస్తున్నారట హరీశ్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news