Newsశ్రీలీల, మృణాల్ ఠాకూర్ వాళ్ల‌ను నిలువునా ముంచేస్తున్నారా...!

శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వాళ్ల‌ను నిలువునా ముంచేస్తున్నారా…!

టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా వెలుగుతున్నారు శ్రీలీల, మృణాల్ ఠాకూర్. పెళ్లి సందడి, ధమాకా, స్కంద, భగవంత్ కేసరి తాజాగా వచ్చిన ఆదికేశవ..ఇలా వరుస సినిమాలతో కషణం తీరిక లేకుండా గడుపుతోంది శ్రీలీల. అలాగే, నితిన్ సరసన ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్, మహేశ్ సరసన గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. ఇలా ఊపిరి సలపనంత బిజీగా శైఇలీల బిజీగా ఉంది.

ఇక మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ తో అమ్మడికి వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ మేన్ సినిమా చేస్తుంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే, తెలుగులో మరికొన్ని సినిమాలు కమిటైందట. అయితే, ఇప్పుడు శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వల్ల నిర్మాతలకి దెబ్బ పడుతోందని టాక్ వినిపిస్తోంది.

శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వరుస సినిమాల కారణంగా ప్రమోషన్స్ కి రాలేకపోతున్నారట. ఇద్దరు భామలు గ్లామరస్ గా ఉంటారు. సినిమాలో మాత్రమే కాదు..ప్రమోషన్స్ లో కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ వీరే. అలాంటి వీరు ప్రమోషన్స్ కి రాలేకపోతున్నారట. తాజాగా రిలీజ్ అయిన ఆదికేశవ సినిమా రిలీజైంది. మొదటి షోతోనే సినిమా ఫ్లాపని తేల్చేశారు. ఇలాంటి సమయంలో సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే ప్రెస్ మీట్స్ అవసరం. శ్రీలీల చాలా అవసరం. కానీ, ఆమె అందుబాటులో లేదు.

ఇక మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా అంతే. ఫ్యామిలీ మేన్ సాంగ్ షూటింగ్ కోసం ఈ బ్యూటీ ముంబైలో ఉంది. దాంతో నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ కి రాలేకపోతుంది. ప్రమోషన్స్ బాధ్యత మొత్తం నాని మీదే పడింది. ఇలాంటి సమయంలో హీరోయిన్స్ ఎంత ముఖ్యమో. కానీ, వాళ్ళే నిర్మాతలకి దెబ్బేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news