Movies"ఏంట్రా నేను దానికి తప్పిస్తే ..వేరే దానికి పనికి రానా..?"..యంగ్ హీరో...

“ఏంట్రా నేను దానికి తప్పిస్తే ..వేరే దానికి పనికి రానా..?”..యంగ్ హీరో పై శ్రీలీల సీరియస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో చాలా జోవియల్ గా ముద్దు ముద్దుగా సరదాగా మాట్లాడిన హీరోయిన్ శ్రీ లీల ఒక్కసారిగా ఫైర్ అయిపోయింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఆమె నటించిన తెలుగు సినిమా “ఆది కేశవ” .

ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది శ్రీ లీల . రీసెంట్గా మ్యాడ్ మూవీ హీరో సంగీత్ శోభన్ ఆమెను ఇంటర్వ్యూ చేశారు . చాలా సరదాగా సాగిపోతున్న ఈ ఇంటర్వ్యూలో శోభన్ మాట్లాడుతూ ..”మేము ఒక మూవీ ప్లాన్ చేస్తున్నామని ..అందులో మీరు హీరోయిన్ అయితే బాగుంటుంది అని.. స్టెప్స్ కూడా అద్దిరిపోయే రేంజ్ లో ఉంటాయని ..మూడు పాటల్లోనూ మీరు స్టెప్స్ ఇరగదీసేయాలని చెప్పుకొస్తాడు”.

దీనిపై స్పందించిన శ్రీలీల కోప్పడుతూ..” అదేంటి నేను డాన్స్ కి తప్పిస్తే వేరే దానికి పనికిరానా..? ఏంటి..?” అంటూ ఘాటుగా స్పందించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. భగవంత్ కేసరితో బిగ్గెస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శ్రీ లీల ప్రజెంట్ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news