Moviesబాలయ్య సినిమాలో రష్మిక మందన్నా.. ఏ పాత్రలో అంటే.. సినిమాకి ఒప్పించింది...

బాలయ్య సినిమాలో రష్మిక మందన్నా.. ఏ పాత్రలో అంటే.. సినిమాకి ఒప్పించింది ఎవరో తెలుసా..?

వాట్ .. బాలయ్య సినిమాలో రష్మిక మందన్నా.. నటించడానికి ఒప్పుకుందా..? ఇది నిజంగా నిజమేనా..? ఇంతకీ ఆమెను ఒప్పించింది ఎవరు ..? ప్రజెంట్ ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం అనగానే అందరికీ టక్కున గుర్తుచేది బాలయ్య. ఏజ్ తో సంబంధం లేకుండా రిస్కీ షాట్స్ లను సైతం తీస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్న బాలయ్య.. తాజాగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .

అయితే బాబీ దర్శకత్వంలో సినిమా కంప్లీట్ అవ్వగానే బాలయ్య సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి . ఇదే న్యూస్ నిజం అంటూ తెలుస్తుంది . బోయపాటితో అఖండ 2 తర్వాత ప్లాన్ చేయబోతున్నాడట బాలయ్య. అంతే కాదు పుష్ప సినిమా తర్వాత సుకుమార్ వెంటనే బాలయ్య తో ఓ చిన్న సినిమాను కూడా తెరకెక్కించబోతున్నారట . కేవలం 6 నెలల్లోనే ఈ సినిమా షూట్ కూడా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట .

అయితే బాలయ్య సినిమాలో ఓ కీలక పాత్రలో రష్మిక మందన్నా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . ఆల్రెడీ సుకుమార్ కి రష్మిక మందన్నా జాన్ జిగిడి దోస్త్ అయిపోయింది . అంతేకాదు రీసెంట్గా అన్ స్టాపబుల్ షో కి వచ్చిన రష్మిక మందన్నా..” మీతో నటించాలని ఉంది సార్” అంటూ కూడా చెప్పుకొచ్చింది. దీంతో బాలయ్య కూడా ఆమెతో నటించడానికి సై అంటూ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా కాకుండా ఓ కీలక పాత్రలో బాలయ్య సినిమాలో రష్మిక కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. దీనంతటికీ శ్రీకారం చుట్టింది కూడా సుకుమారే అంటూ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news