Newsబోల్డ్ సీన్లు చేయ‌లేకే మెగా హీరో బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిన శివానీ..!

బోల్డ్ సీన్లు చేయ‌లేకే మెగా హీరో బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిన శివానీ..!

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కోట బొమాళి పీఎస్’ భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మలయాళంలో హిట్ సాధించిన నాయట్టు సినిమా అయినా దర్శకుడు పూర్తిగా మన నేటివిటీకి, ఇక్కడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథ, కథనాలు మలిచి తీయడం ఈ సక్సెస్ కి ప్రధాన కారణం. టీమ్ అందరూ ‘కోట బొమ్మాళీ’ సక్సెస్ మూడ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే, ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన శివానీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను వదులుకున్న ‘ఉప్పెన’ సినిమా గురించి క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందు నాకే ఛాన్స్ వచ్చింది. కానీ, కథ విన్నప్పుడు కొన్ని బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ చేయలేనని ‘ఉప్పెన’ ఆఫర్ ని వద్దన్నాను అని తెలిపింది.

ఇక ఇప్పటికీ అలాంటి సీన్స్ చేయలేననే అనుకుంటున్నా.. అంటూ శివానీ కంఫర్ట్ లెవల్ గురించి తెలిపింది. ఒకవేళ ‘ఉప్పెన’ మూవీ ఒప్పుకుంటే కెరీర్‌లో భారీ హిట్ తన ఖాతాలో చేరి ఉండేది. ఆ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన కృతిశెట్టి ఒక్కసారిగా ఎంత సూప‌ర్ పాపుల‌ర్ అయ్యిందో చూశాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news