Moviesబాల‌కృష్ణ‌లో ఆ టాలెంట్ చూసి ఆయ‌న ఫ్యాన్ అయిపోయా... డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి...

బాల‌కృష్ణ‌లో ఆ టాలెంట్ చూసి ఆయ‌న ఫ్యాన్ అయిపోయా… డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటు వెండితెర‌తో పాటు అటు బుల్లితెర‌ను షేక్ చేసిప‌డేస్తున్నారు. వెండితెర‌పై మూడు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టిన బాల‌య్య‌… ఇటు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో దుమ్ము దులుపుతున్నాడు. అస‌లు అన్‌స్టాప‌బుల్ టాక్ షోతో బాల‌య్య రికార్డుల దుమ్ము లేపేశాడు. గ‌త నెల‌లో భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య తాజాగా యానిమ‌ల్ సినిమా టీంతో అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్‌ను హోస్ట్ చేశారు.

యానిమ‌ల్ టీంతో బాల‌య్య హోస్ట్ చేసిన ఈ షోకు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ఎపిసోడ్‌కు యానిమ‌ల్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్‌, హీరోయిన్లు ర‌ష్మిక‌తో పాటు మ‌న తెలుగువాడు అయిన ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కూడా హాజ‌ర‌య్యారు. ఈ షోలో పాల్గొన్న ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ బాల‌య్య‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ షో చూసి తాను షాక్ అయ్యాన‌ని… బాల‌య్య గారిపై చాలా మందికి ఉన్న అభిప్రాయాన్ని ఈ షో మార్చింద‌ని చెప్పాడు. అందులోనూ బాల‌య్య రణ‌బీర్ తాత‌గారు చెప్పిన మొఘ‌ల్ ఏ అజ‌మ్ సినిమాలో డైలాగ్ చెప్ప‌డంతో ర‌ణ‌బీర్‌కే మ‌తిపోయింద‌న్నాడు. అస‌లు ఆ డైలాగ్ ర‌ణ‌బీర్‌కే పూర్తిగా గుర్తులేదు… అలాంటిది బాల‌కృష్ణ గారు అంత పెద్ద డైలాగ్ ఎలా గుర్తు పెట్టుకున్నార‌న్న‌ది చూసి షాక్ అయ్యాను.. వెంట‌నే ఆయ‌న ఫ్యాన్ అయిపోయా అని సందీప్ తెలిపారు.

ఇక భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య ప్ర‌స్తుతం దర్శకుడు బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో సాలిడ్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లో 109వ సినిమాగా తెర‌కెక్కుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news