Newsమాజీ మొగుడి కొత్త గర్ల్ ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తున్న సమంత..కలియుగంలో...

మాజీ మొగుడి కొత్త గర్ల్ ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తున్న సమంత..కలియుగంలో ఆదర్శ ఇల్లాలు అంటే ఇదే..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం బాగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత ఏ పోస్ట్ పెట్టిన ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు ఆమె ఏం చేస్తుంది..? ఎవరితో తిరుగుతుంది ..? అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే సమంత హీరోయిన్ శోభిత ధూళిపాల పెట్టిన పోస్టుకు లైక్ కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మామూలుగా శోభిత ధూళిపాల పోస్టుకు లైక్ కొడితే ఇంత క్యూరియాసిటీ ఉండేది కాదేమో . అయితే ఎప్పుడైతే సమంత మాజీ భర్త నాగచైతన్యతో శోభిత ధూళిపాల క్లోజ్ గా ఉండడం .. ఆయన పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు రావడం జరిగిందో అలాంటి మూమెంట్లో కూడా సమంత ఆమె ఫోటోకి లైక్ కొట్టడం ప్రశ్నార్ధకంగా మారింది . అసలు సమంత ఎందుకు ఇలా చేసింది..? అంటూ ఫ్యాన్స్ కూడా బుర్ర పీక్కుంటున్నారు .

రీసెంట్గా జియో మామి లాంచ్ ఈవెంట్ కు హాజరైంది శోభిత ధూళిపాల . ఈ ఈవెంట్ కి సంబంధించిన పిక్స్ షేర్ చేసింది . మనీష్ మిల్హోత్రా డిజైన్ చేసిన గోల్డ్ కలర్ శారీలో అద్భుతంగా ఉండింది శోభిత. ఈ ఫొటోస్ కి సమంత లైక్ కొట్టింది . దీంతో మాజీ మొగుడు కొత్త గర్ల్ ఫ్రెండ్ కి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నావా సామ్ ..? అంటూ కొందరు వ్యంగ్యంగా కౌంటర్ వేస్తుంటే . వాళ్లు ఫ్రెండ్స్ రా బాబు వాళ్ళ మధ్య గొడవలు పెట్టకండి..? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news