News' స‌లార్ 1 ' ర‌న్ టైం వ‌చ్చేసింది... ప్ర‌భాస్ కెరీర్‌లోనే...

‘ స‌లార్ 1 ‘ ర‌న్ టైం వ‌చ్చేసింది… ప్ర‌భాస్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం బిగ్ రిస్క్‌..!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” . ఈ సినిమా కోసం ఇండియ‌న్ సినీ జ‌నాలు ఎంత ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక క్రిస్మ‌స్ కానుక‌గా స‌లార్ డిసెంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ సినిమా ర‌న్ టైం లాక్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. స‌లార్ 1 భారీ రన్ టైం లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సలార్ పార్ట్ 1 ర‌న్ టైంను మేకర్స్ ఏకంగా 2 గంటల 55 నిమిషాలకి కట్ చేసారట. దీంతో ఇది ప్రభాస్ కెరీర్లో చాలా లాంగ్ ర‌న్ టైంతో వ‌స్తోన్న సినిమా అని చెప్పాలి. అయితే సినిమా సాగ‌దీసిన‌ట్టుగా ఉంటే మాత్రం ఇది బిగ్ రిస్కే అవుతుంది.

మ‌రి 2.55 గంట‌లు అంటే ఏకంగా 175 నిమిషాల పాటు సీట్ల‌లో కూర్చొని సినిమా చూడాలి. మ‌రి ఇంత సేపు ప్రేక్ష‌కులు సీట్ల‌లో ఉండాల‌ని నీల్ ఏ రేంజ్‌లో యాక్ష‌న్‌, ఎలివేష‌న్లు చూపించాడో చూడాలి. ఇక హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరాంగ‌దూర్ నిర్మించిన ఈ సినిమాకు ర‌విబ్ర‌సూర్ సంగీతం అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news