Movies"ఇప్పుడే చూసేయ్యండి..మళ్లీ ఈ వీడియో డిలిట్ చేసేస్తా"..అద్దిరిపోయే వీడియోని షేర్ చేసిన...

“ఇప్పుడే చూసేయ్యండి..మళ్లీ ఈ వీడియో డిలిట్ చేసేస్తా”..అద్దిరిపోయే వీడియోని షేర్ చేసిన పాయల్(Video)..!!

పాయల్ రాజ్ పుత్ తాజాగా నటించిన సినిమా “మంగళవారం”. ఆర్ఎక్స్ 100 తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయిన పాయల్ కు మంగళవారం సినిమా సూపర్ డూపర్ హిట్ ని అందించింది . అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ టూ బోల్డ్ గా నటించడమే కాకుండా తనలోని నటనా టాలెంట్ ను బయటపెట్టింది .

ఈ సినిమా నేడు ఉదయం థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తుంది . హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . ఈ క్రమంలోనే ఎమోషనల్ అవుతూ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ స్పెషల్ వీడియోని షేర్ చేసింది . అంతేకాదు ఆ వీడియో త్వరగానే డిలీట్ చేసేస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ..” నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ అవ్వలేదు ..ఇలాంటి వీడియోలు కూడా చేయలేదు.. ఈ వీడియో కూడా త్వరగానే డిలీట్ చేసేస్తాను ..ఆడియన్స్ తో కలిసి సినిమా చూడడం చాలా చాలా నచ్చింది.. సినిమాను హిట్ చేసినందుకు థాంక్యూ ..ఇలాంటి మంచి సినిమాలలో నటించడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను “అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది .

ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుంది. పాయల్ రాజ్ పుత్ మంగళవారం సినిమాలో సెక్సువల్ డిజాస్టర్ తో బాధపడే పాత్రలో కనిపించింది . ఈ పాత్ర కోసం చాలా కష్టపడింది అని తెరపై చూస్తేనే అర్థమయిపోతుంది. ఈ సినిమా గురించి మాటల్లో చెప్పుకోవడం కంటే తెరపై చూస్తేనే బాగుంటుంది అంటున్నారు అభిమానులు..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news