Newsబిగ్ షాకింగ్‌: ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ షూటింగ్‌ల నుంచి ప‌వ‌న్ అవుట్‌...!

బిగ్ షాకింగ్‌: ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ షూటింగ్‌ల నుంచి ప‌వ‌న్ అవుట్‌…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల షూటింగ్ల‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ? ప్రారంభమవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇక సుజిత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ఓజీ, హరీశంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ కూడా ఇప్పట్లో ముగుస్తుందా అంటే అన్ని సందేహామే. ఓజీ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు.

అయితే పవన్ పొలిటికల్ గా ఫుల్ బిజీ అయిపోయాడు. తెలంగాణలో ఇప్పటికే అభ్యర్థులను ఫిక్స్ చేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల అయినా ప్రచారం చేయాలి. పైగా మోడీ సభలో పాల్గొనాలి. ఈ నెల 9 నుంచి ఆంధ్రలో ఉమ్మడి కార్యాచరణ ఉంది. ఈలోగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు సమీక్షలు ఉంటాయి. ఇవన్నీ కలిపి నవంబర్, డిసెంబర్ డేట్లు ఫిల్ చేసేస్తాయి. జనవరి నుంచి ఆంధ్ర ఎన్నికల హడావుడి మొదలవుతుంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ ఎన్నికల హడావుడి మామూలుగా లేదు.

దీంతో పవన్ ఇక పూర్తిగా ఏపీలోనే ఉండాల్సి వస్తుంది. అన్ని జిల్లాల్లో పార్టీ నిర్మాణం, టిడిపితో పొత్తులు, సీట్ల లెక్కలు, అభ్యర్థుల ఎంపిక, వీటితోనే పవన్ కు టైం అయిపోయేలా ఉంది. అందుకే ఓజీ – ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ కూడా ఇప్పట్లో పూర్తయ్య ఛాన్సులే లేవు. వచ్చే మే నెల తర్వాత మాత్రమే పవన్ డేట్లు ఇచ్చేలా వాతావరణం ఉంది. ఇక వచ్చే సమ్మర్ వరకు కూడా పవన్ సినిమాలు రిలీజ్ అవుతాయని ఆశించిన అభిమానులకు కూడా నిరాశ తప్పేలా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news