Movies"ఆడు గొప్పోడు ఏంటి..?"..హీట్ పెంచేస్తున్న త్రివిక్రమ్-కోట శ్రీనివాస రావు కామెంట్స్..!!

“ఆడు గొప్పోడు ఏంటి..?”..హీట్ పెంచేస్తున్న త్రివిక్రమ్-కోట శ్రీనివాస రావు కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ పలు యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నారు . తాజాగా కోటా శ్రీనివాసరావు గారు సైతం పలు యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన లైఫ్ లో జరిగిన విషయాలపై సినిమా ఇండస్ట్రీలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ పై స్పందిస్తున్నారు. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కు కోటా శ్రీనివాసరావు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఒకప్పుడు దర్శకులకు ఇప్పటి దర్శకులకు తేడా ఏంటి ..? అనే విషయం ఆయన క్లియర్ కట్గా వివరించేశారు. మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ డైరెక్టర్ అనుకుంటున్న ప్రశాంత్ నీల్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ..రాజమౌళి ..సుకుమార్ లాంటి డైరెక్టర్లలో ఉన్న ప్లస్లు మైనస్సుల గురించి ఓపెన్ గా చెప్పుకువచ్చేశారు.

“ఇదే క్రమంలో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ రాజమౌళి అని.. ఒక గొప్ప దర్శకుడు కి ఉండాల్సిన లక్షణాలు ఆయనకు ఉన్నాయి అని.. ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు కూడా ఫీలింగ్ అలాగే ఉంటుంది అని చెప్పుకొచ్చారట . అంతేకాదు త్రివిక్రమ్ ని చాలా మంది పొగిడేస్తూ ఉంటారు ..కానీ ఆయన అంత గొప్పవాడు అని నాకు అనిపించదు ..మాటల్లో తప్పిస్తే డైరెక్షన్లో పెద్దగా ప్రతిభ ఉండదు” అనే విధంగా పరోక్షంగా కామెంట్స్ చేశారు. దీంతో కోటా శ్రీనివాసరావు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి”.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news