Newsఅలా అయితేనే నీ సినిమాలో చేస్తా.. నాగార్జున‌కే కండీష‌న్లు పెట్టిన స్టార్...

అలా అయితేనే నీ సినిమాలో చేస్తా.. నాగార్జున‌కే కండీష‌న్లు పెట్టిన స్టార్ హీరోయిన్‌…!

జ్యోతిక..మంచి పర్ఫార్మర్ గా సౌత్ లో బాగా పాపులారిటీని సాధించింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ని పెళ్లి చేసుకొని కొంతకాలం సినిమాలకి దూరంగా ఉంది. మళ్ళీ రెండేళ్ల నుంచి తమిళ సినిమాలలో నటిస్తూ వస్తోంది. జ్యోతిక నటించిన మొదటి సినిమా వాలి. ఈ సినిమాలో ఒకే ఒక్క సాంగ్ లో కనిపించి బెస్ట్ డెబ్యూ గా అవార్డ్ అందుకుంది.

ఆ తర్వాత హీరోయిన్ గా చాలా సినిమాలలో నటించి స్టార్ గా మారింది. తెలుగులో జ్యోతిక నటించిన సినిమాలన్ని బాగా పేరు తెచ్చాయి. చిరంజీవితో ఠాగూర్, నాగార్జున తో మాస్, రవితేజతో షాక్ సినిమాలు చేసి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలో నటించిన చంద్రముఖి మొత్తం సౌత్ లోనే క్రేజ్ ని రెట్టింపు చేసింది. కన్నడలో సౌందర్య నటించిన ఆప్తమిత్ర సినిమానే తమిళంలో వచ్చిన చంద్రముఖి.

చెప్పాలంటే సౌందర్య కంటే జ్యోతిక చాలా బాగా చేసిందని చెప్పుకున్నారు. అయితే, జ్యోతిక తెలుగులో నటించిన సినిమాలకి కండీషన్స్ పెట్టిందట. మరీ ముఖ్యంగా నాగార్జున తో నటించిన మాస్ సినిమాకి ఎక్కువ కండీషన్స్ పెట్టిందట. దీనికి కారణం సూర్యతో లవ్ లో ఉండటమే. 2006లో సూర్య, జ్యోతిక పెళ్లి చేసుకున్నారు. కానీ, 2003 లో ఠాగూర్, 2004 లో మాస్ సినిమాలు చేసింది.

కేవలం షూటింగ్ కోసం తప్ప ఇంక వేరే ఏ విషయాలలో ఇబ్బంది పెట్టకూడదని షూటింగ్ అయిపోగానే వెళ్లిపోతానని ఓవర్ ఎక్స్‌ఫోజింగ్ చేయనని..ఎలాంటి రొమాంటిక్ సీన్స్ కూడా చేయనని తెగేసి చెప్పిందట. ఇలాంటి కండీషన్స్ ఓకే అయితేనే ప్రాజెక్ట్ కి సైన్ చేస్తానని సూర్యతోనే చెప్పించిందట. ఆ కండీషన్స్ కి ఓకే అనుకునే ఇక్కడ సినిమాలకి జ్యోతిక ని తీసుకున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news