Newsఆ బడా హీరో ఇంటికి అల్లుడు కావాల్సిన వాడు ..ఇలా దగ్గుబాటి...

ఆ బడా హీరో ఇంటికి అల్లుడు కావాల్సిన వాడు ..ఇలా దగ్గుబాటి ఫ్యామీలోకి ఎలా వచ్చాడో తెలుసా..?

టైం ఎప్పుడు .. ఎలా.. మారిపోతుందో ఎవ్వరు గెస్ చేయలేరు. కొన్ని కొన్ని సార్లు మనం ఊహించనవి జరుగుతూ ఉంటాయి. సామాన్యుల లైఫ్ లో కూడా ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ సినిమాలల్లో ఎక్కువగా నటించి అభిమానులను సొంతం చేసుకున్నాడు .

రీసెంట్గా వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని ఎంగేజ్మెంట్ చాలా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. విజయవాడకు సంబంధించిన ఓ బడా డాక్టర్ ఫ్యామిలీకి తన కూతుర్ని ఇవ్వబోతున్నాడు వెంకటేష్ . అబ్బాయి పేరు ఆకాష్.. అంతేకాదు బాగా చదువుకున్నాడు. వెల్ సెటిల్ . కోట్ల ఆస్తికి వారసుడు . గుణాలలో రాముడినే మించి పోయే అంత మంచి బాలుడు అనిపించుకునే వాడు . అలాంటి ఓ చక్కనైన అబ్బాయిని తన కూతురికి తీసుకొచ్చాడు వెంకటేష్ .

అయితే ఆకాష్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఇంటికి అల్లుడుగా వెళ్లాల్సిందే అలా మిస్ అయ్యి ఇలా వెంకటేష్ ఇంటికి అల్లుడుగా వచ్చారు . ఆ సంబంధం మరేదో కాదు నిహారిక . ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిహారిక కు ఆకాష్ కు పెళ్లి చేస్తే బాగుంటుంది అంటూ ఓ మ్యాచ్ వచ్చిందట. అయితే నిహారికకు డాక్టర్ ని చేసుకోవడం ఇష్టం లేదు . అందుకే ఈ సంబంధాన్ని రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత పలు సంబంధాలు చూశాక జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లికి ఒప్పుకునింది . పెళ్లి కూడా చేసుకుంది ..విడాకులు కూడా ఇచ్చేసింది . దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news