టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య తాజాగా నటిస్తున్న సినిమా ఎన్.బి.కె 109. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ సెట్స్ పై ఉంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారా..? అంటూ చాలా పెద్ద సస్పెన్షన్ నెలకొంది . కానీ ఫిల్మ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ త్రిష నటించబోతున్నారట .
అంతేకాదు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కత్తిలాంటి ఫిగర్ మీనాక్షి చౌదరిని చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయిన మీనాక్షి చౌదరి .. ఐదు తెలుగు సినిమాలను రెండు తమిళ్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంది . ఈ క్రమంలోనే బాలయ్య లాంటి టాప్ సీనియర్ హీరో సరసన అవకాశం కొట్టడంతో..
ఫాన్స్ ఆమె పేరుని ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు మీనాక్షికి ఇది లైఫ్ లో గుర్తుండిపోయే మెమొరీ అంటూ ఈ సినిమా ఖచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మహేశ్ పుణ్యమా అంటూ మంచి ఆఫర్ నే పట్టేసింది ఈ బ్యూటీ..!!