Newsమెగాస్టార్ కోసం అనుష్క పెద్ద త్యాగ‌మే చేస్తోందిగా... ఇంత రిస్క్ అవ‌స‌ర‌మా...

మెగాస్టార్ కోసం అనుష్క పెద్ద త్యాగ‌మే చేస్తోందిగా… ఇంత రిస్క్ అవ‌స‌ర‌మా స్వీటీ…!

మెగాస్టార్ చిరంజీవి సరసన సోషియో ఫాంటసీ సినిమాలో స్వీటీ బ్యూటీ అనుష్క హీరోయిన్ గా నటించబోతుందన్న వార్తలు చాలాకాలం కిందటే బయటికి వచ్చాయి. యూవీ సంస్థ నిర్మించే ఈ సినిమా కోసం హీరోయిన్‌గా అనుష్క ఫైనల్ అయిన విషయం వాస్తవం. నవంబర్ మూడో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మెగాస్టార్ మోకాలి శాస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుని షూటింగ్ కోసం రెడీగా ఉన్నారు. ఆయన వస్తే ఇక షూటింగ్‌ బండి ఆగదు.

అయితే ఇప్పుడు అనుష్కతో అంత ఈజీ కాదని తెలుస్తోంది. యూవీ సంస్థ నిర్మించిన మిస్‌ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చాన్నాళ్లు ప్రొడక్షన్ లోనే ఉంది. అనుష్కతో వచ్చిన సమస్య ఏంటంటే ? ఆమె శరీరాకృతి చాలావరకు పెరిగింది. ఆమె శరీరాకృతిని కొంతవరకు సిజి చేయాల్సి ఉంటుందట. ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం ఆమె భారీగా బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సైజ్ జీరో సినిమా కోసం ఆమె భారీగా బరువు పెరిగి ఆ తర్వాత బరువు తగ్గాల్సి వచ్చింది.

అయితే ఆమె ఎంత లావు అయ్యారో.. ఆ తర్వాత సన్నబడటం ఆమె వల్ల కాలేదు. ఆమె శరీరాకృతి ఆమె ఫిజిక్ లో మార్పులు వచ్చేసాయి. ఆ ఒక్క సినిమా చేయటం వల్ల ఆమె కెరీర్ చాలా వరకు డౌన్ అయ్యింది అని చెప్పాలి. ఆ సినిమా కోసం ఆమె బరువు పెరిగి.. తగ్గటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొన్నారన్నా ప్రచారం జరిగింది. ఇప్పటికీ కూడా అనుష్క ఇంకా కాస్త ఒళ్ళు చేసి ఉన్నారు.

ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం మరోసారి రిస్క్ చేసి సన్నబడటం కాస్త ఇబ్బంది అని చెప్పాలి. అయినా యూవీ సంస్థ ఆమెకు పుట్టిల్లు లాంటిది. అందుకే చిరంజీవి సినిమాలో సన్నగా.. నాజూకుగా కనిపించేందుకు ఆమె సన్నబడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news