Newsప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం బాల‌య్య చేసిన టైటిల్ త్యాగం ఇదే...!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం బాల‌య్య చేసిన టైటిల్ త్యాగం ఇదే…!

ఎస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ మంచి స్నేహితులు అయ్యారు. రాజకీయ ఇంకా కూడా వచ్చే ఎన్నికల్లో జనసేన – తెలుగుదేశం కలిసి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. బాలయ్య టాక్ షోకు పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇటు సినిమాల పరంగా చూసుకున్న బాలయ్య – పవన్ అభిమానుల మధ్య ఇప్పుడు మంచి సఖ్యత ఏర్పడింది. బాలయ్య తాజాగా భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకు ముందుగా బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ అనుకున్నారు. ఈ సినిమాలో ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. అయితే ఆ టైటిల్ నుంచి వెనక్కు తగ్గాడు దర్శకుడు అనిల్ రావిపూడి. భగవంత్‌ కేసరి అనే పేరు పెట్టి రిలీజ్ చేశారు. దీని వెనక ఆసక్తికరమైన కథ నడిచిందట. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన రీమేక్‌ సినిమా బ్రో.

ఆ సినిమాకు బ్రో అనే టైటిల్ అనుకున్నట్టు ముందుగా ప్రచారం జరిగింది. ముందుగా పవన్ కళ్యాణ్ సినిమాకు బ్రో అని పెట్టి.. ఆ వెంటనే బాలయ్య సినిమాకు బ్రో ఐ డోంట్ కేర్ అని పెడితే బాగుండదన్న ఉద్దేశంతో భగవంత్ కేసరి అన్న టైటిల్ పెట్టినట్టు సమాచారం. అలాగే బాలయ్యకు టైటిల్స్ పవర్ఫుల్ గా ఉండాలి. సమరసింహారెడ్డి – నరసింహనాయుడు – లక్ష్మీ నరసింహ – లెజెండ్ – సింహ ఇలా టైటిల్స్ అన్ని పవర్ ఫుల్ గా చాలా ఏళ్లపాటు గుర్తుండిపోయేలా ఉన్నాయి.

ఈ క్రమంలోనే హీరో పాత్ర పేరు టైటిల్ గా పెడితే చాలా పవర్ఫుల్ గా ఉండడంతో పాటు చాలా రోజులు పాటు గుర్తుండిపోతుందని నేలకొండ భగవంత్ కేసరి పేరును షార్ట్ కట్ చేసి భగవంత్‌ కేసరి అని పెట్టినట్టు అనిల్ రావిపూడి స్వయంగా చెప్పారు. అలా ప‌రోక్షంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం బాల‌య్య బ్రో ఐ డోన్ట్ కేర్ టైటిల్ త్యాగం చేసిన‌ట్లైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news