Moviesహిట్లు లేని శ‌ర్వానంద్ సినిమాకు రు. 50 కోట్లు... పిచ్చెక్కిందా మీకు..!

హిట్లు లేని శ‌ర్వానంద్ సినిమాకు రు. 50 కోట్లు… పిచ్చెక్కిందా మీకు..!

ఇటీవల టాలీవుడ్ లో నిర్మాతలకు పిచ్చి ముదిరిపోతుంది. ఒక హీరోతో సినిమా చేస్తున్నాం అంటే ఆ హీరో మార్కెట్ ఎంత ? బిజినెస్ జరుగుతుంది ? ఆ సినిమా మీద ఎంత బడ్జెట్ పెట్టవచ్చు ? అన్న లెక్కలు లేకుండా ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటూ పోతున్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక సినిమాకు హిట్ టాక్‌ వచ్చినా నష్టాలు తప్పట్లేదు. ఇందుకు ఉదాహరణ నాని సినిమాలు.. నాని రెమ్యూనరేషన్ ఒకప్పుడు తొమ్మిది కోట్ల రేంజ్ లో ఉండేది.. ఇప్పుడు నాని రెమ్యునరేషన్ 25 కోట్లకు వెళ్ళిపోయింది.

దానితో సినిమా అంటే ఈజీగా రు. 70 కోట్లు ఖర్చవుతుంది. నాన్‌ థియేటర్ ఆదాయం తీస్తే.. థియేటర్ మీద ఎవరికి లాభాలు వస్తున్న పరిస్థితి లేదు. సినిమా హిట్ అయిన నాని సినిమా మీద లాభాలు కళ్ల చూస్తే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అరుదుగా కనిపిస్తున్నారు. దసరా లాంటి సినిమాకి కొన్నిచోట్ల నష్టాలు తప్పలేదు. అమౌంట్ వెనక్కి ఇచ్చారన్న గుసగుసలు ఉన్నాయి. ఇప్పుడు శర్వానంద్ కూడా అదే రూట్లోకి వెళ్లిపోతున్నట్టుగా ఉంది. టాలీవుడ్ లో పీపుల్స్ మీడియా మంచి మంచి కాంబినేషన్లతో సినిమాలు తీస్తోంది.

ఇటీవ‌ల వ‌చ్చిన‌ రామబాణం సినిమా విషయంలో ఆ సంస్థ పెద్ద తప్పు చేసింది. గోపీచంద్ లాంటి మార్కెట్ లేని హీరో.. శ్రీవాస్ లాంటి డిజాస్టర్ దర్శకుడు కాంబినేషన్ నమ్మి 35 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దీంతో ఆ సినిమా ఆ సంస్థకు భారీ నష్టాలు మిగిల్చింది. ఇప్పుడు శర్వానంద్‌తో ఆ సంస్థ తీస్తున్న సినిమాకు కూడా అదే తప్పు జరుగుతోంది. ఇప్పటికే 45 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. శర్వానంద్ సినిమాలకు ఇప్పుడు సరైన మార్కెట్ లేదు. ఈ సినిమాకు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.. అతడి కెరీర్ ట్రాక్ రికార్డు తెలిసిందే. ఇలాంటి కాంబినేషన్ మీద ఇప్పటికే 45 కోట్లు దాటేసింది. ఇంకా నాలుగు ఐదు కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నారు.

రు. 50 కోట్ల రికవరీ శర్వానంద్ సినిమాతో సాధ్యమా అంటే అస్సలు సాధ్యం కాదు. పోనీ నాన్ థియేటర్ ఎంత లేదన్నా రు. 30 కోట్లు వచ్చింది. అనుకున్న థియేటర్ మీద రు. 20 కోట్లు రావడం శర్వానంద్ సినిమాలకు జరిగే పని కాదు.. ఇప్పుడు సినిమా యావరేజ్ అయినా జనాలు థియేటర్లకు రావడం లేదు.. సూపర్ హిట్ అన్న టాక్‌ వస్తేనే వస్తున్నారు. ఏది ఏమైనా పీపుల్స్ మీడియా తన తర్వాత సినిమాల విషయంలో అయినా ఆచితూచి ముందుకు వెళితే మంచిదన్న చర్చలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news