Moviesరివ్యూ: మ్యాడ్ .. న‌వ్వి న‌వ్వి చావాల్సిందే

రివ్యూ: మ్యాడ్ .. న‌వ్వి న‌వ్వి చావాల్సిందే

ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ హీరోగా పరిచయమైన సినిమా మ్యాడ్‌. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం ?

క‌థ‌:
ఈ కథ చాలా సింపుల్ గా ఉంటుంది. మనోజ్ – అశోక్ – దామోదర్ అనే ముగ్గురు స్నేహితుల కథ ఇది. ముగ్గురు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే పరిచయం.. ఆ తర్వాత స్నేహంగా మారుతుంది. ఇంజనీరింగ్ ముగిసేసరికి వీళ్ళ కథలు ఎలా ? రూపాంతరం చెందాయి.. ఎవరి జీవితంలో ఎవరి పాత్ర ? ఎంత వారి ప్రేమ కథ ఏంటి ? చివరికి తమ ప్రేమని గెలిపించుకోవడానికి చేసే తింగరి ప్రయత్నాలు ఏంటి అన్నది ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
కొన్ని సినిమాలకు కథలు అవసరం లేదు అన్న బ్రాంతి కలిగించే సినిమా ఇది. ద‌ర్శ‌కుడు కాగితం పట్టుకుని కూర్చున్నప్పుడు కథ‌ని కాకుండా కేవలం సన్నివేశాలు మాత్రమే రాసుకుంటూ వాటిని పేర్చుకుంటూ వెళ్ళాడు అనిపించేలా సినిమా ఉంది. అయితే ఆ సీన్లు పేర్చుకునే ప్రవాహంలోనే ఫన్ పుట్టుకొచ్చింది. ముగ్గురు కుర్రాళ్ళు వాళ్ళ స్నేహం, అమాయకత్వం, ఆకతాయి తనం నుంచి పుట్టుకొచ్చిన అల్లరి, వాళ్ళ ప్రేమ కథలు.. కాలేజ్ గొడవలు ఇదే సినిమా. ఇప్పటివరకు వచ్చిన కాలేజ్ కథలు కుర్రాళ్ళు సినిమాలు ఇవన్నీ మ్యాడ్‌లో చూస్తున్నప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి.

కొన్ని సీన్లు హ్యాపీడేస్ లా ఉంటాయి. మరి కొన్ని హిందీలో వచ్చిన త్రి ఇడియట్స్ లాను అనిపిస్తాయి. సినిమాకు వెళ్లేటప్పుడు జీరో అంచనాలతో వెళతాం కాబట్టి మనకు ఎంత కామెడీ ఇచ్చిన హెవీ గానే ఉంటుంది. అలా చాలా సీన్లు ఈ సినిమాలో చేరతాయి. కాలేజీలో ప్రిన్సిపల్ స్పీచ్, హాస్టల్లో ర్యాగింగ్, పరీక్షల్లో చీటీలు పెట్టి రాయటం.. అమ్మాయిల వెంట పడటం కోసం రెండు వర్గాల గొడవ, ఇవన్నీ పాత సినిమాల్లో బిట్లే.. కానీ కొత్త మొహాల మీద ప్లే చేయడంతో అవి కూడా ఫ్రెష్ ఫీల్ తీసుకువచ్చాయి. హ్యాపీడేస్ సినిమాలో శేఖర్ కమ్ముల రెండు బ్యాచ్‌ల‌ మధ్య క్రికెట్ మ్యాచ్ పెట్టాడు. ఇక్కడ బాస్కెట్బాల్ అంతే తేడా..!

ఈ సినిమాలో బాస్కెట్‌బాల్ ఎపిసోడ్ కూడా మంచి నవ్వు తెప్పిస్తుంది. చాలా సీన్లు మన కాలేజీ లైఫ్ లో ఇలానే జరిగాయి అన్నట్టుగా ఉంటాయి. చిన్న చిన్న మూమెంట్స్, సింగిల్ లైనర్లు దర్శకుడు బాగా రాసుకున్నాడు. చివర్లో ముగ్గురు స్నేహితులు మధ్య అగ్గిరాజుకునే సందర్భం పుట్టించిన దాన్ని చాలా క్యాజువల్ గా డీల్ చేసిన పద్ధతి బాగుంది. ఫస్ట్ స్టాప్ కంటే సెకండ్ హ్యాండ్ కాస్త డల్ గా స్టార్ట్ అవుతుంది. అయితే లేడీస్ హాస్టల్లో ఎపిసోడ్‌తో కథ‌ మళ్ళీ ఊపు వస్తుంది. కథ‌, స్క్రీన్ ప్లే.. కాకరకాయ లాంటి పెద్ద ట్విస్టుల జోలికి పోకుండా యూత్ కి ఏం నచ్చుతుంది ? వాళ్లకు ఎలాంటి కంటెంట్‌ ఇవ్వాలి అన్నదానిపై దర్శకుడు ఫోకస్ పెట్టాడు. మాట‌లు ఈ త‌రానికి బాగా న‌చ్చేలా ఉన్నాయి.

ఫైన‌ల్‌గా…
జాతిర‌త్నాలు కంటే ఎక్కువ న‌వ్వుతారు.. లేక‌పోతే మీ డ‌బ్బులు వాప‌స్ అని నిర్మాత నాగ‌వంశీ ఛాలెంజ్ విసిరారు. జాతిర‌త్నాలుతో పోల్చ‌లేం కాని… మ్యాడ్ కూడా న‌వ్వించే సినిమాయే. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా జోరుకు బ్రేకులు ఉండ‌క‌పోవ‌చ్చు.

మ్యాడ్ రేటింగ్ : 3

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news