Newsప్ర‌భాస్‌కు ఆ వీక్‌నెస్ ఉందా... వామ్మో ఇది పెద్ద డేంజ‌రేగా...!

ప్ర‌భాస్‌కు ఆ వీక్‌నెస్ ఉందా… వామ్మో ఇది పెద్ద డేంజ‌రేగా…!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి భారీ పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ డిసెంబర్ 22న సలార్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర డైనోసార్ గా గ‌ర్జించనున్నారు. సలార్‌ సినిమాపై దేశవ్యాప్తంగా కనివినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇలా వరుసగా భారీ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రభాస్ మధ్యలో డైరెక్టర్ మారుతీ తో కూడా కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి కామెడీతో సాగే ఫుల్ ఫన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్‌పై ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట.

ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పూర్తిగా కనిపిస్తాడని యాక్షన్ హర్రర్ నేపథ్యంలో వచ్చే ఈ సినిమా అదిరిపోతుందని కథలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మారుతి ఇప్పటికే 55 % పూర్తి చేశారు. అన్నట్టు ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడని.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రభాస్ ఓల్డ్ యాక్టర్‌కి ఓ వీక్నెస్ ఉంటుందంటున్నారు.

ప్ర‌భాస్‌కు ఉన్న ఆ వీక్నెస్‌తో ఆ పాత్ర చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తుందని కూడా తెలుస్తోంది. ఆ వీక్‌నెస్‌తో సాధారణంగా వచ్చే కామెడీ సీక్వెన్స్‌లు, ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటాయని తెలుస్తోంది. మారుతి గతంలో భలే భలే మగాడివోయ్ సినిమాలో నానికి, మహానుభావుడు సినిమాలో శర్వానంద్ కి చిన్న చిన్న వీక్నెస్‌లు పెట్టి ఎలాంటి కామెడీ పండించాడో చూసాం. మరి ఇప్పుడు ప్రభాస్ సినిమాతో ఏ రేంజ్ లో ?కామెడీ పండిస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news